అగ్రిగోల్డ్ బాధితులకు హైకోర్టు కానుక..
posted on Dec 31, 2015 @ 11:14AM
అగ్రిగోల్డ్ బాధితులకు హైకోర్టు కొత్త సంవత్సరం కానుకను ఇచ్చింది. ఈ రోజు అగ్రిగోల్డ్ కుంభకోణంపై విచారణ జరిపిన హైకోర్టు అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా మూడు కంపెనీలకు అగ్రిగోల్డ్ కు సంబంధించిన ఆరు ఆస్తులను అమ్మేందుకు అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎంఎస్ పీసీ, శ్రీరామ్ ఆటోమల్స్, ఇ. ప్రొక్యూర్ లీ అను మూడు కంపెనీలు అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మనున్నాయి. అంతేకాదు ఈ మూడు కంపెనీలకు హైకోర్టు కొన్నిసూచనలు కూడా చేసినట్టు తెలుస్తోంది. ఆస్తులు వేలం వివరాలు వెబ్ సైట్ లో పొందుపరచాలని.. దీనికి సంబధించిన వెబ్ సైట్ మూడు వారాల్లోగా ఏర్పాటు చేయాలని సూచించిది. కాగా వాదన సమయంలో హైకోర్టు అగ్రిగోల్డ్ ఛైర్మన్ ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగగా.. దానికి విచారణకు సహకరిస్తున్నందున అరెస్ట్ చేయలేదని ఏపీ సీఐడీ న్యాయవాది తెలిపారు. తదుపరి విచారణను ఫిభ్రవరి 8 కి వాయిదా వేశారు.