హాయ్ గీత.. నువ్వే నా లవరన్న యువకుడు.. కట్ చేస్తే..
posted on Jul 29, 2021 @ 5:21PM
అబ్బాయి..హాయ్ గీత.. ఎలా ఉన్నావ్.. అమ్మాయి ఎవరు ? అబ్బాయి నువ్వు నాకు తెలుసు..? అమ్మాయి ఎలా తెలుసు ? ఏం తెలుసు? మళ్ళీ అబ్బాయి నువ్వు చాలా బాగుంటావని తెలుసు.. నీ స్మైల్ బాగుంటుందని తెలుసు..అనగానే అమ్మాయి మరి అన్ని తెలిస్తే షీ టీంకి కంప్లైంట్ చేస్తారని తెలియదా? అనగానే అబ్బాయి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పానుగా బేబీ నన్ను ఎవరు పట్టుకోలేరని.. అన్నాడు ఇంట్రెస్టింగా ఉంది కదా..? ఇది తెలుగు సినిమాలో హీరో హీరోయిన్ మధ్య జరిగే సీన్ కాదు.. సంభాషణ అంతకంటే కాదు.. సామాన్య మైన కామంతో కొవ్వు ఎక్కిన అబ్బాయికి, ఒక సాధారణమైన అమ్మాయికి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ ఎప్పుడు ఈ చాటింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కామంతో, రిమ్మతెగులుతో రెచ్చిపోయాడో పోకిరీ. వాట్సాప్‌లో యువతికి మెసేజులు పంపుతూ నిత్యం వేధింపులకు దిగాడు. నువ్వు అందంగా ఉంటావంటూ మాటల్లో పెట్టే ప్రయత్నం చేశాడు. ఇంతకీ ఏం కావాలని ఆ అమ్మాయి అడిగితే కొంటెగా గుండెల్లో చోటు అన్నాడు.. అక్కడ అయితే ఇవ్వలేను కానీ.. జైల్లో ఖాళీ ఉంటుందేమో అంటూ ఆ అమ్మాయి ఘాటుగానే రిప్లై ఇచ్చింది. అయినా నన్నెవరు పట్టుకోలేరు బేబీ అంటూ పలికాడు కామ గురుడు. అయితే యువతి షీ టీం ఒక్క చాన్స్ ఇద్దామంటూ యువతి షీ టీం పేరుతో షాకిచ్చింది. ఆ తర్వాత మెసేజులు ఆగిపోయాయి. సుమారు గంట తర్వాత ఏంటి రిప్లై లేదు అని మెసేజ్ చేస్తే.. షీం టీం రిప్లై చూసి యువతి హ్యాపీ. సుమారు 48 నిమిషాల తర్వాత మళ్లీ మెసేజ్ చేసిన యువతికి షీ టీం నుంచి మెసేజ్ వచ్చింది.గంటలోనే గురుడికి షాకివ్వడంతో ఇద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ వైరల్‌గా మారింది.
కట్ చేస్తే.. అయితే రంగంలోకి దిగి కేటుగాడి పనిపట్టారు సైబరాబాద్ షీ టీం పోలీసులు. యువతిని వేధింపులకు గురిచేసిన గంటలోనే పోకిరీకి ఊహించని షాకిచ్చారు. అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిపోయాయి. అదే ఆ మెసేజ్. ఇక మీరు నిశ్చింతగా ఉండొచ్చని షీ టీం భరోసా ఇస్తూ చేసిన మెసేజ్‌కి యువతి థాంక్స్ చెప్పింది. ఈ వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ బయటికి రావడంతో వైరల్‌గా మారింది. అసలు ఆ గంటలోపే ఏం జరిగిందనేని ఆసక్తికరంగా మారింది. అయితే యువతి షీ టీంకి ఫోన్ చేయడం.. వెంటనే అతన్ని ట్రేస్ చేసి పోలీసులు అరెస్టు చేయడం చకచకా జరిగిపోయాయి మరి. సో ఇదండీ మ్యాటర్ ఇక మీద ఎవరైన అమ్మాయిలను వేధించేవాళ్లు ఉంటే, అమ్మాయిలను వేదించాలని అనుకుంటే ఆ ఆలోచనని పురిటి లోనే చంపేస్తే బెటర్ మరి.. ఎందుకంటే రోజులు బాగాలేవు.. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది.. సో జాగ్రత్త అలాంటివి మానుకుని భవిష్యత్తు గురించి ఆలోచించండి.