టెలికా౦లపై రూ. 31 వేల కోట్ల పన్ను
posted on Nov 9, 2012 @ 11:21AM
నిర్దేశిత పరిమితికన్న ఎక్కువ స్పెక్ట్రమ్ కలిగి ఉన్న జీఎస్ఎం టెలికం కంపెనీల నుంచి పన్ను వసూలు చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా దాదాపు రూ. 31వేల కోట్లను సమీకరించాలని భావిస్తోంది. కేంద్ర౦ నిర్ణయం ప్రభావం ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా, రిలయన్స్, టాటా వంటీ టెలీ ఆపరేటర్లపై త్రీవ్రంగా ఉండనుంది. ఫలితంగా ఈ కంపెనీలు వినియోగదారులపై భారం మోపుతూ కాల్ ఛార్జ్ లను పెంచే అవకాశం ఉంది.
ప్రధానమంత్రి నేతృత్వంలో కేంద్ర మంత్రి వర్గం సమావేశమై ఈ నిర్ణయాలు తీసుకు౦ది. ఈ వివరాలను ఆర్ధకమంత్రి చిదంబరం, టెలీ కమ్యూనికేషన్ల మంత్రి కపిల్ సిబల్ వెల్లడించారు. టెలీకం నియంత్రణ సంస్థ నిర్దేశించిన పరిమితికి మించి స్పెక్ట్రమ్ ను వినేయోగించుకుంటున్న కంపెనీలపై ఎకమోత్తంలో పన్ను విధించాలని సాధికార మంత్రుల బృందం సిపార్సు చేసిందని, కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని చిదంబరం తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు జీఎస్ఎమ్ ఆధారిత టెలీకం కంపెనీల్లో 4.4 మెగాహెర్జ్ ను మించి ఉన్న స్పెక్ట్రమ్ కంపెనీల్లో వేలంపాట ద్వారా ధర నిర్ణయించి ఆ మొత్తాన్ని వసూలు చేస్తాం. 6.2 మెగాహెర్జ్ ను మించి ఉన్న జీఎస్ఎమ్ కంపెనీలపై ఒకేసారి పన్ను విధిస్తాం. జూలై 2008 నుంచి ఈ ఏడాది ఆఖరి వరకూ ఉన్న వ్యవధికి ఈ పన్ను విధింపు వర్తిస్తుందని ఆయన చెప్పారు.