హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం
posted on May 3, 2025 @ 8:03PM
హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉన్నట్టుండి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. మల్కాజ్ గిరి, తార్నాక, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్, సికింద్రాబాద్ బోడుప్పల్ పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. ఈరోజు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, రంగారెడ్డి, సిరిసిల్లలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. మరోవైపు నగరంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షం షురూ అయ్యింది.
ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్న సమయంలో వర్షం ఉపశయం కలిగింది. గత కొన్ని రోజులుగా నగరంలో భారీగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. శనివారం సాయంత్రం వాతావరణం మారిపోయి వాన కురిసింది. వాన కురవడంతో నగరం చల్లబడగా.. ఉక్కపోత నుంచి జనం ఉపశమనం పొందుతున్నారు. ఇదిలా ఉండగా.. ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 26 డిగ్రీలు ఉండే అవకాశం ఉందని దక్షిణం, నైరుతి దిశ నుంచి ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.