థర్డ్ వేవ్ భయం వద్దు.. పిల్లల కోసం ఇవేగో జాగ్రత్తలు..
posted on Jun 10, 2021 @ 11:03AM
దేశంలో కల్లోలం స్పష్టించిన కొవిడ్ సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం దేశంలో రోజువారీ కేసులు లక్షకు లోపే నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్ ఉధృతి తగ్గిందని ఊపీరి పీల్చుకుంటున్న జనాలకు ఇప్పుడు మరో వార్త కలవరపెడుతోంది. త్వరలోనే కొవిడ్ థర్డ్ వేవ్ రాబోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మొదటి వేవ్ కంటే రెండో వేవ్ తీవ్రత ఎక్కువగా కనిపించింది. సెకండ్ వేవ్ లో మరణాలు ఉహించని స్థాయిలో నమోదయ్యాయి. ఆక్సిజన్ కొరతతో రోగులు పిట్టల్లా రాలిపోయారు. అయితే రాబోయే థర్డ్ వేవ్.. సెకండ్ వేవ్ తో పోల్చితే మరింత ప్రమాదకరంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మూడోదశలో పిల్లలకు ఎక్కువగా వైరస్ కు ప్రభావితం అవుతారని చెబుతున్నారు. ఇదే ఇప్పుడు ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది.
తాము కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పిల్లలకు వైరస్ సోకితే ఎలా అన్న ఆందోళన తల్లిదండ్రులకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో పిల్లలకు కోవిడ్ చికిత్సకు సంబంధించి కేంద్రం కీలక మార్గదర్శకాలు జారీచేసింది. చిన్న పిల్లలు కరోనా బారిన పడితే ఎలాంటి చికిత్సలు అందించాలనే విషయమై ఆరోగ్య శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS)వీటిని రూపొందించింది. పిల్లలకు ఎలాంటి టెస్టులు చేయాలని, చికిత్సలో ఏం వాడాలి.. ఎలాంటి జాగ్రత్తలో తీసుకోవాలని అన్నది పొందుపరిచింది.
పిల్లల కోసం కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలు...
1. కరోణా లక్షణాలు స్పల్పంగా ఉన్న 18 ఏళ్లలోపు పిల్లల ఊపిరితిత్తుల్లో వైరల్ లోడ్ తెలుసునేందుకు హై రిజల్యూషన్ సి.టి.స్కాన్‌ను అంతగా వినియోగించాల్సిన పనిలేదు. అవసరం లేకున్నా HRCTCతీయకూడదు. హేతుబద్ధంగా ఉపయోగించాలి.
2. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉండి.. జ్వర, దగ్గు ఉంటే పారాసిటమాల్ మాత్రలు ఇవ్వాలి. కాస్త పెద్ద వయసున్న పిల్లలు గోరువచ్చని సెలైన్ ద్రావణాన్ని పుక్కిలించాలి.
3. కరోనా లక్షణాలు తక్కువగా ఉన్నప్పుడు.. యాంటీ మైక్రోబయల్స్ మందులు ఉపయోగించకూడదు. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు పిల్లలను ఆసుపత్రిలో చేర్పించాల్సిన పనిలేదు. ఒకవేళ చేర్పిస్తే వారికి ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటుంది.
4. కరోనా చికిత్సలో అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను పిల్లలకు అస్సలు ఇవ్వకూడదు. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నవారు, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నవారికి మాత్రమే స్టెరాయిడ్స్ ఇవ్వాలి.
5. వ్యాధి తీవ్రత మధ్యస్థ స్థాయిలో ఉన్నప్పుడు తక్షణమే ఆక్సిజన్ థెరఫీ ప్రారంభించాలి. ఇన్‌హేలర్ వంటివి వినియోగించకూడదు. రక్తం గడ్డకట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
6. పిల్లలు ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పుడు డీజీహెచ్ఎస్ సూచనల ప్రకారం.. ట్రీట్‌మెంట్ ఇవ్వాలి. బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ ఉంటే యాంటీ మైక్రోబయల్స్ వాడాల్సి ఉంటుంది.