రైతులకై పుట్టిన పార్టీ చివరకు కనుమరుగవనుందా?
posted on Oct 22, 2019 @ 11:29AM
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ ఓ పార్టీ ఇరవై ఏళ్లుగా అధికారం కోసం ఎదురు చూపులు చూస్తోంది.హర్యానా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన,ఉద్యమాలతో ప్రజల్లో స్థానం దక్కించుకున్న పార్టీ ఇప్పుడు గడ్డు పరిస్థితుల్లో ఉంది. వివరాల్లోకి వెళ్తే ఇండియన్ నేషనల్ లోక్ దళ్(ఐఎన్ఎల్డీ) పార్టీని స్థాపించింది చౌదరి దేవిలాల్. ఓంప్రకాష్ చౌతాలా తండ్రి. పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో దేవీలాల్ భారతీయ లోక్ దల్ గా పార్టీని స్థాపించారు. తర్వాత లోక్ దల్ గా పంతొమ్మిది వందల తొంభై ఆరు లో ఐఎన్ఎల్డీగా మార్చారు ఐఎన్ఎల్డీ రైతుబంధు పార్టీగా గుర్తింపు పొందింది. దేవీలాల్ రైతుల కోసం పోరాటం చేశారు అందుకే ఆయన్ని హర్యానా ప్రజలంతా పెదనాన్న అంటూ పిలుచుకునేవారు. ఎమర్జెన్సీ సమయంలోనూ అనేక ఆందోళనలు చేశారు దేవీలాల్. న్యాయయుద్ధం పేరుతో దేవీలాల్ ఐఎన్ఎల్డీని ప్రజల్లోకి తీసుకెళ్ళారు. అలా ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా చివరికి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా ఎదిగారు.
ముఖ్యంగా దేవీలాల్ హర్యానా సీఎంగా ఉన్నప్పుడు రైతుల మేలు కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇది ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లింది. దేవీలాల్ మాస్ లీడర్ గా ఎదిగడమే కాక ఆ తర్వాత పార్టీని సీఎం పదవిని కుమారుడు ఓంప్రకాష్ చౌతాలాకి అప్పగించారు.హర్యానా రాజకీయాల్లో దేవీలాల్పేరు ఓ మంత్రం.కానీ అదే దేవీలాల్ కలలు కన్న పార్టీ ఇప్పుడు రెండుగా చీలింది. కుటుంబ పార్టీలో కలహాలు రావడంతో ఓంప్రకాష్ చౌతాలా కుమారుడు రెండుగా విడిపోయారు. అజయ్ చౌతాల అతని కుమారులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అజయ్ చౌతాల కుమారుడు దుష్యంత్ చౌతాలా జేపీపీ పేరుతో కొత్త పార్టీని పెట్టారు ఆ పార్టీ లోక్ సభ ఎన్నికల్లోనే ఐఎన్ ఎల్డీ ఓటు బ్యాంకును భారీగా చీల్చింది. ఎదిగిన ఐఎన్ఎల్డీ ఇప్పుడు ఒకటి రెండు స్థానాలకు పరిమితమవుతున్న తీరు నిజంగా షాక్ కు గురి చేస్తోంది. గత నాలుగు సార్లు అధికారానికి దూరమైన ఐఎంఎంటి ఇప్పుడు మరింతగా దిగజారింది. తాజా ఎగ్జిట్ పోల్స్ లో ఆ పార్టీ ఒకటి రెండు స్థానాలకు మాత్రమే పరిమితం అవుతాయి అని ఈ సర్వే లో తేలింది.పార్టీ ఎలా కుదేలవుతుంది అన్నది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది.
రైతుల కోసం పుట్టిన పార్టీ ఇప్పుడు ఉనికి కోసం అష్ట కష్టాలు పడుతోంది.ఇప్పటికే పదిహేనేళ్లుగా అధికారంలో లేదు పైగా ప్రజల్లోనూ మద్దతు కోల్పోతూ వచ్చింది.హర్యానాలో ఇప్పుడు కాంగ్రెస్ కోలుకునే పరిస్థితి లేదు. రెండు వేల ఐదు రెండు వేల పది ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన ఇప్పుడు ఆ పార్టీ మళ్లీ కుదేలైంది. పడడం లేవడం కాంగ్రెస్ కి కొత్తేమీ కాదు. కానీ ఐఎన్ఎల్డీ పరిస్థితి అలా కాదు ఇప్పుడు ఆ పార్టీ గెలిచే స్థానాలు సింగిల్ డిజిట్ కే పడిపోవడం పార్టీ చీలడం ఇలా అన్నీ ఆ పార్టీని మరింత కుదేలయ్యేలా చేశాయి. దేవీలాల్ రాజ్ ఆశలు, అంచనాలు ఇప్పుడు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చేసింది. ఉద్యమాలతో రైతుల కోసం పుట్టిన పార్టీ ఇప్పుడు ప్రజామద్దతు కోల్పోయే పరిస్థితికొచ్చింది. ఒకప్పుడు ఎనభై ఐదు స్థానాలు గెలుచుకున్న పార్టీకి ఇప్పుడు ఒకటి రెండు స్థానాలు మాత్రమే దక్కుతాయని సర్వే లు చెపుతున్నాయి.ఇక ఈ పార్టీ పరిస్థితి ముందు ముందు ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.