అటెండర్ పోస్టుకు రెడీ : హరీష్

 

 

 

తాను అన్న మాటకు కట్టుబడి తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో అటెండర్ పోస్టుకు సిద్దంగా ఉన్నానని టిఆర్ఎస్ శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. తెలంగాణా కు అనుకూలంగా తన తండ్రి లేఖ ఇచ్చినందున ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో అటెండర్ పోస్టు చేయడానికి హరీష్ రావు సిద్దంగా ఉన్నారా అని నారా లోకేష్ నిన్న ట్విట్టర్ లో ప్రశ్నించిన విషయం తెలిసిందే.

 

తెలంగాణా కు అనుకూలంగా చంద్ర బాబు కేంద్ర మంత్రి చిదంబరానికి లేఖ ఇచ్చినట్లయితే, తాను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో అటెండర్ పోస్టు చేస్తానని హరీష్ రావు గత జనవరి 13 న సిద్ధిపేట లో తెలంగాణా దీక్షలకు సంఘీభావ కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

 

లోకేష్ ట్విట్టర్ వ్యాఖ్యలకు హరీష్ రావు స్పందిస్తూ, తాను అటెండర్ పోస్టుకు సిద్దంగా ఉన్నానని, అయితే,చంద్ర బాబు ముందుగా ‘జై తెలంగాణా’ అనే నినాదం చేసి, తెలంగాణా అమరవీరుల స్మారక స్థూపాల వద్ద దండలు వేయాలని అన్నారు. హరీష్ తన స్పందనను మరో సామాజిక అనుసంధాన సైట్ ఫేస్ బుక్ లో ప్రచురించారు.

Teluguone gnews banner