యు.ఎస్‌లో పెరుగుతోన్న హానా క్రేజ్
posted on Aug 21, 2022 @ 2:35PM
చిన్నపుడు మన ఇళ్ల దగ్గరికి వచ్చి జోస్యం చెబుతాం రండి.. చిలక జోస్యం చెబుతాం రండి.. అంటూ రంగుల దుస్తుల్లో వచ్చే వాడంట వాడి మాటలకు, పాటకు అంత క్రేజ్ ఉండేది. పంజరంలోంచి చిలకను బయటికి తీసి దాని ముందు పది కాయితాలు పడేస్తే ఏదో ఒక కాయితం పట్టి వాడికి ఇస్తే, ఏదో చదివి చెబుతూంటాడు. చిత్రంగా అందరికీ మేలే జరిగే మాటలే చెబుతాడు. వాడికి నాలుగు డబ్బులు కావాలిగనుక!
నిజంగా భవిష్య వాణి చెప్పేవారు చాలా అరుదు. మనిషిలో ఏదో అతీతశక్తి ఒక్కోసారి అలా మాట్లాడిస్తుందనే వాదనా ఉంది. కానీ అదో నిమిషాల సమయమే మాట్లాడనిస్తుంది. కొందరు గుర్తుంచుకుని రాసి పెడతా రు. వాటిలో ఒక్కటి రెండు తప్ప అన్నీ జరుగు తాయి. ఇపుడు లేటెస్ట్‌గా అలాంటివారి జాబితాలోకి చేరింది హానా కారొల్. ఈ 19 ఏళ్ల అమెరికా అమ్మాయి 2022లో జరిగే పది అద్భుతాలను ఏకంగా నోట్‌బుక్‌లో రాసిందట. ఎలిజిబత్ రాణి మరణం, హేలీ బీబర్ గర్భందాల్చడం కూడా అందులో ఉన్నాయి. ఆధునిక భావాలున్న ఈ అమ్మాయి ఎక్కువగా పాప్ కల్చర్ అంటే ఇష్టపడుతుంది, సెలబ్రటీస్‌ని కలుస్తూంటుందిట.
అయితే క్రమేపీ కేవలం ఫోటోలు చూసి మరీ చెప్పగలిగే స్థాయికి ఎది గింది. నెలకు లక్షన్నర సంపాదిస్తోంది. ఎవరయినా ఫోటో పంపితే దాన్ని పట్టుకుని ఒక్క పది పదిహేను నిమిషాలు ఏకాంతంలో ఆ ఫోటోనే చూస్తూంటే తనకు తెలియకుండానే ఆ వ్యక్తి గురించి తెలిసిపోతోందని చెబుతోంది హానా. ఫోటోలు పంపేవారి ప్రేమ జీవితం, పెళ్లి, ఉద్యోగ వ్యాపారాలు, ఆరోగ్యం గురించి అనేక అంశాలు చెబుతుంది.
చాలామంది తనకు వీరాభిమానులుగా మారారని అంటోంది. అయితే ఇంత పేరు ప్రతిష్టలు గడించినా హానా మాత్రం చాలా మామూలు అమ్మాయిలానే జీవించాలనుకుంటోంది. ఎవరో వచ్చి తనను పొగడ్తలతో ముంచెత్తడం, సన్మా నాలు చేసి చెక్ ఇవ్వడాలు ఇలాంటివి తనకు నచ్చవని చెబుతోంది. భవిష్యత్ చెప్పడం అనేది తనకు కొంత తెలియకుం డానే జరిగిపోతోంది గనుక తాను ప్రత్యేకించి అందుకు శిక్షణ తీసుకోలేదంటుంది హానా. భోజనం చేసినంత సులువుగా జరిగి పోతోంది.. మానసిక ఒత్తిడికి కూడా గురి కావడం లేదని ఆమె అన్నది.