సహజీవనం... సజీవదహనం
posted on Mar 13, 2015 @ 11:34AM
సహజీవనం వికటించింది... సజీవ దహనంగా మారింది. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం గండికోట మణికంఠ అనే వ్యక్తి ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. వీరికి రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. గురువారం రాత్రి ఒక్కసారిగా ఇంటి నుంచి మంటలు చెలరేగడంతో వెంటనే స్థానికులు విషయాన్ని గమనించి పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తరువాత పోలీసులు ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా చిన్నారి, మహిళ మృత దేహాలను గుర్తించారు. మణికంఠే వారిద్దరినీ హత్య చేసి ఇంటికి నిప్పంటించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.