మోడీ హ్యాట్రిక్ ఖాయమంటున్న సర్వేలు
posted on Dec 17, 2012 @ 8:12PM
నేడు జరిగిన గుజరాత్ రెండవదశ పోలింగులో ఇంతవరకు కనీవినీ ఎరుగని రీతిలో దాదాపు 70% ఓటింగు పోలయినట్లు సమాచారం. కొద్దిసేపటి క్రితమే ఓటింగ్ పూర్తవడంతో వివిధ సర్వేసంస్థలు రంగంలోకి దూకి గుజరాత్ ప్రజల నాడిని పట్టుకొనే ప్రయత్నoచేసాయి. ఐదు ప్రముఖ సర్వేసంస్థలు చేప్పటిన సర్వేలో ప్రస్తుత గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడికీ శాసనసభలో 182 సీట్లలో కనీసం 120 సీట్లకి తక్కువ కాకుండా విజయం సాదించబోతున్నాడని స్పష్టం చేసాయి.
ఒకనొక దశలో మోడీ విజయవకాశాలకు గండికొట్టగల సమర్దుడని చెప్పబడ్డ కేషు భాయిపటేల్ ప్రభావం గుజరాత్ ఎన్నికలలో పెద్దగా ఉండబోదని సర్వే రిపోర్టులు అన్నీ స్పష్టం చేస్తున్నాయి. వరుసగా మూడవసారి గుజరాత్ ముఖ్యమంత్రి కాబోతున్ననరేంద్రమోడీ ఈ విజయంతో ‘హ్యాట్-ట్రిక్’ సాదించబోతుండగా, అతని ప్రియమయిన ప్రత్యర్ది రాహుల్ గాంధీకూడా ఇదే ఎన్నికల ద్వారా ‘హ్యాట్రిక్’ సాధించబోతున్నాడు. ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో పార్టీని తనసారద్యంలో ఓటమిపాలు చేసిన రాహుల్ గాంధీ గుజరాత్ లో కూడా ఓడించిపెట్టడంతో ఈ ‘హ్యాట్రిక్’ సాదించగలిగేడు. హ్యాట్రిక్ సాదించిన ఇద్దరికీ శుభాకాంక్షలు
వివిధ సర్వే సంస్థల రిపోర్టులు:
|
BJP |
Congress |
Others |
CNN/IBN |
124 |
56 |
|
Nelsons |
126 |
50 |
6 |
|
|
|
|
Chanakya |
120 |
54 |
4 |
Times Now |
120 |
58 |
- |
NTV |
120 |
58 |
- |
Aaj Tak |
118-128 |
40 |
- |
|
|
|
|