అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ప్రసంగం పూర్తి పాఠం

మాన్యశ్రీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ శాసనపరిషత్తు, మాన్యశ్రీ సభాపతి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మరియు గౌరవ శాసనమండలి సభ్యులు: అందరికీ నా శుభాభినందనలు.  2025-26 బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ శాసనసభ ఉమ్మడి సమావేశంలో ప్రసంగించడం నిజంగా నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.

 గౌరవ ముఖ్యమంత్రి   నారా చంద్రబాబు నాయుడు, గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్, గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారల నాయకత్వం పట్ల విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచుతూ, ఎన్డీయే ప్రభుత్వ సంకీర్ణం   సంపూర్ణ మద్దతును ప్రతిబింబిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు శాసనసభ ఎన్నికలలో నా ప్రభుత్వానికి ప్రజలు అపూర్వమైన తీర్పును ఇచ్చారు.       ఈ ప్రభుత్వానికి లభించిన అఖండ, చారిత్రాత్మక మెజారిటీ ప్రజా సంకల్పానికి నిదర్శనం మాత్రమే కాదు, గత ప్రభుత్వ దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా ప్రజలిచ్చిన బలమైన ప్రకటన కూడా.
గత ప్రభుత్వంలో అన్నిరంగాల్లో జరిగిన దుర్వినియోగం వల్ల మనం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితి గురించి నేను ఈ సభలో గతంలో చేసిన ప్రసంగాన్ని సభ దృష్టికి తీసుకొస్తున్నాను. గత ఐదేళ్లలో (2019-24) జరిగిన దుర్మార్గపు పాలన రాష్ట్రాన్ని ఆర్థిక పతనం అంచుకు చేర్చింది. గత ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఏడు శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేశాను. ఈ శ్వేత పత్రాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దుర్వినియోగాన్ని బయటపెట్టాయి. రాష్ట్ర వనరుల మళ్లింపు, సహజవనరుల దోపిడీ, ఎక్సైజ్, ఇసుక తవ్వకాల్లో లోపభూయిష్ట విధానాలతో రాష్ట్ర ఆదాయానికి గండిపడటం, ప్రభుత్వ పన్నులను దారి మళ్లించడం ద్వారా 25 సంవత్సరాల భవిష్యత్తు ఆదాయాన్ని కోల్పోవడం, అధిక రుణ స్థాయి, అధిక వడ్డీ రేట్లకు రుణాలు తీసుకోవడం, భారత ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి రుణాలు తీసుకోవడం, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల మళ్లింపు, అన్ని ప్రాజెక్టులను స్తంభింపజేయడం ద్వారా నీటిపారుదల రంగం పతనం, ఇంధన రంగం విధ్వంసం, రూ.1.35 లక్షల కోట్ల మేర అప్పులు ఉన్నాయి.    
అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే గౌరవనీయ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు గారు వారి దార్శనిక నాయకత్వంలో నా ప్రభుత్వం ఆరు హామీలను అమలు చేసేందుకు, ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర పునరుజ్జీవనం కోసం నిరంతరం కృషి చేస్తూ బ్రాండ్ ఆంధ్ర ప్రదేశ్ కుపూర్వ వైభవాన్ని పునరుద్ధరించడం ప్రారంభించాము. మొదటి కొద్ది రోజుల్లోనే, మేము మా వాగ్ధానాలను నెరవేర్చడానికి, అలాగే ప్రజల జీవితాలలో స్పష్టమైన మెరుగుదలలను తీసుకురావడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నాము.  , ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం, సామాజిక భద్రతా పింఛన్లను రూ.4,000/-లకు పెంచడం, విద్యా రంగాన్ని బలోపేతం చేయడం కోసం 16,347 మంది ఉపాధ్యాయుల నియామకానికి మెగా డిఎస్సీని ప్రకటించడం, ఉపాధి అవకాశాలను అంచనా వేయడానికి, పెంచడానికి నైపుణ్య గణనను నిర్వహించడం, 204 అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, గుంతలు లేని రోడ్ల కోసం మిషన్, ఉచిత ఇసుక పాలసీ విధానం అమలు వంటివి అందులో కొన్ని.
గత దుర్భల పాలన, దుష్పరిపాలన నుంచి బాధ్యతాయుతమైన, సుపరిపాలన ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావడంలో గత ఎనిమిది నెలల్లో మా ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించింది. గత ప్రభుత్వం నిలిపివేసిన 93 కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 74 పథకాలను పునరుద్ధరించి రూ.9,371 కోట్ల అప్పులు తీర్చాం. ఇది ప్రస్తుత, భవిష్యత్ సంవత్సరాలకు భారత ప్రభుత్వం నుండి మరిన్ని నిధులవిడుదలకు అవకాశం కల్పించింది. ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడానికి, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ పై విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి నీటిపారుదల, రోడ్లు, ఇతర పనులకు సంబంధించి రూ.10,125 కోట్ల బిల్లులను క్లియర్ చేశాం. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న రూ.2,488 కోట్ల ఆర్థిక సంఘం గ్రాంట్లను విడుదల చేయడం ద్వారా స్థానిక పాలనను బలోపేతం చేశాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి నిర్మిస్తామని ఇటీవల శాసనసభ ఎన్నికలలో ఎన్.డి.ఏ. హామీ ఇచ్చినట్లుగా పోలవరం  ప్రాజెక్టు, అ మరావతి రాజధాని ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించాం. విశాఖ ఉక్కు కర్మాగారం పునరుద్ధరణ, కొత్త రైల్వే జోన్ ఏర్పాటు హామీలను నెరవేర్చాలనే మా నిబద్ధతకు ఇది నిదర్శనం. సుస్థిర వృద్ధి, శ్రేయస్సుకు దోహదపడే 22 కొత్త విధానాలను ప్రారంభించడం ద్వారా బలమైన పునాది వేశాం.   
మా ప్రయత్నాలు ఇప్పటికే ఫలితాలను ఇస్తున్నాయనే విషయాన్ని పంచుకోవడానికి నేను గర్విస్తున్నాను. భారీ పెట్టుబడుల కోసం గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ కంపెనీ, టాటా పవర్, గ్రీన్ కో గ్రూప్, బిపిసిఎల్, టిసిఎస్ వంటి అనేక అంతర్జాతీయ దిగ్గజాలను ఆకర్షిస్తున్నాం. ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. 4 లక్షల మందికి ఉపాధి అవకాశాల కల్పనకు ఇది దోహదపడింది. 2024-25 మొదటి ముందస్తు అంచనాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గత సంవత్సరం రూ.14.22 లక్షల కోట్ల నుండి రూ.16 లక్షల కోట్లకు విస్తరించింది. ఇది 12.94% నామ మాత్రపు వృద్ధి రేటు. మన తలసరి ఆదాయం కూడా గత సంవత్సరంలోని రూ.2.37 లక్షల నుంచి రూ.2.68 లక్షలకు పెరిగింది.  వ్యవసాయం, అనుబంధ రంగాలు 15.86%, పరిశ్రమలు 6.71%, సేవల రంగం 11.70% చొప్పున వృద్ధి చెందాయి. ఈ ప్రగతి అన్ని కీలక రంగాలలో గణనీయమైన పనితీరు వల్ల సాధ్యమయింది. 
గొప్ప సంఘ సంస్కర్త స్వర్గీయ శ్రీ కందుకూరి వీరేశలింగం గారు చెప్పినట్లు, 
"అవకాశాలు ఇస్తే ప్రతీ మనిషిలో మేటి నైపుణ్యం వెలుగొందుతుంది." 
అవకాశాలు ఇస్తే ప్రతి ఒక్కరిలోని ప్రతిభ ప్రకాశిస్తుంది.
నా ప్రభుత్వం ఇప్పుడు స్వర్ణాంధ్ర @ 2047 దిశగా ప్రయాణిస్తోంది.
 ఏ సమాజమైనా సుభిక్షంగా ఉండాలంటే సంక్షేమం, అభివృద్ధి కలిసి కట్టుగా సాగాలి. అవి ఒకే నాణేనికి రెండు పార్శ్వాలు. ఒకటి లేకుండా, మరొకటి కుదుటపడదు. ఆర్థిక పురోగతి, సామాజిక సంక్షేమం పెనవేసుకుపోయేలా ఈ సమతుల్యతను సాధించడానికి ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉంది. ఈ విధానం కేవలం రోడ్లు లేదా పరిశ్రమల నిర్మాణానికి సంబంధించినది కాదు. జీవితాలను నిర్మించుకోవడం గురించి. రైతుల నుంచి విద్యార్థుల వరకు, మహిళల నుంచి అట్టడుగు వర్గాల వరకు అందరూ అభివృద్ధి చెందిన సమాజాన్ని సృష్టించడం.  అసమానతలను తగ్గించే, అవకాశాలను అందించే, వృద్ధికి ఊతమిచ్చే సమతుల్య విధానానికి ఈ ద్వంద్వ దృష్టి అవసరం. సంక్షేమం,  అభివృద్ధి కలిసికట్టుగా సమ్మిళిత ప్రగతి, సుస్థిర మరియు పరివర్తన చెందే ఒక ధర్మ చక్రాన్ని సృష్టిస్తాయి.
భారతదేశంలో స్వయం సహాయక బృందాల ద్వారా మహిళా సాధికారత సాధించడంలో గౌరవనీయ ముఖ్యమంత్రి మార్గదర్శిగా ఉన్నారు. 1995లోనే స్వయం సహాయక బృందాలను రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాల్లో కీలక భాగంగా చేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచారు. స్వయం సహాయక బృందాలు లక్షలాది మంది మహిళలు, వారి కుటుంబాల జీవితాలను మారుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో స్వయం సహాయక బృందాల బ్యాంకు లింకేజీ వృద్ధి అమోఘం. గ్రామీణ ప్రాంతాల్లో ఏటా సుమారు రూ.35,000 కోట్ల బ్యాంకు లింకేజీ పంపిణీతో 30% జాతీయ వాటాతో స్వయం సహాయక బృందాల బ్యాంకు లింకేజీ కార్యక్రమం కింద 99.66% రికవరీతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 
అదే సమయంలో, గౌరవ ముఖ్యమంత్రిగారు ఐటీ విప్లవానికి నాయకత్వం వహించి, హైదరాబాద్ గ్లోబల్ టెక్నాలజీ హబ్ గా ఎదగడానికి పునాది వేశారు. ఐటిపై రాష్ట్రం ముందుగానే దృష్టి పెట్టడం వల్ల ప్రవాస తెలుగువారు ఈ పరివర్తనను ప్రత్యక్షంగా చూశారు, ప్రవాస తెలుగువారి తలసరి ఆదాయం అమెరికాలో అత్యధికంగా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరో విప్లవానికి నాయకత్వం వహిస్తోంది. ఐటి నుండి కృత్రిమ మేధ వరకు పరిపాలన, పరిశ్రమలు, ఆర్థిక వృద్ధి  భవిష్యత్తును రూపొందించడానికి కృత్రిమ మేధస్సు యొక్క శక్తిని ఉపయోగిస్తున్నది.
నా ప్రభుత్వం స్వర్ణాంధ్ర @2047 సుభిక్ష భవిష్యత్తు కోసం మన దార్శనికతను నిర్వచించే పది మార్గదర్శక సూత్రాలను రూపొందించింది.  
అవి...
పూర్తిగా పేదరికం నిర్మూలన.
మానవ వనరుల అభివృద్ధి & జనాభా నియంత్రణ. 
నైపుణ్యం పెంపుదల, ఉపాధికల్పన
నీటి భద్రత
రైతు-అగ్రిటెక్ 
గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్
వ్యయ నియంత్రణ, విద్యుత్ & ఇంధనం
ఉత్పత్తి పరిపూర్ణత 
స్వచ్ఛాంధ్ర
విస్తృత సాంకేతికత ఏకీకరణ
 వికసిత్ భారత్ దార్శనికతతో నా ప్రభుత్వం 'పీపుల్ ఫస్ట్' విధానంతో స్వర్ణాంధ్ర @2047 సాధించడానికి సమగ్ర రోడ్ మ్యాప్ ను అమలు చేస్తోంది. 15శాతం పైన వృద్ధి రేటుపై దృష్టి సారించడం ద్వారా 2047 నాటికి, 100 సంవత్సరాల స్వతంత్ర భారతదేశానికి గుర్తుగా 'సంపన్న, ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన' సుస్థిరమైన, అత్యంత నివాసయోగ్యమైన సమాజంగా మారడానికి మరియు రూ.58 లక్షల తలసరి ఆదాయంతో రూ.308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి రాష్ట్రం తన ప్రత్యేకమైన అంతర్గత బలాలను సద్వినియోగం చేసుకుంటున్నది. 
వ్యక్తులు, కుటుంబాలకు సాధికారత కల్పించడం ద్వారా రాబోయే కొన్నేళ్లలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం స్వర్ణాంధ్ర @ 2047 ప్రయాణంలో ఒక ఆవశ్యకత. ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటి వద్దకే పింఛన్లు అందించేందుకు దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్¬టిఆర్ భరోసాకు శ్రీకారం చుట్టాం. మరే రాష్ట్రంలోనూ ఇంత భారీ డిబిటి సంక్షేమ పథకం లేదు. ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లకు నెలవారీ పెన్షన్ రూ.3,000 నుంచి రూ.4,000కు, దివ్యాంగులకు రూ.3,000 నుంచి రూ.6,000కు పెంచడమయింది. ఈ పథకం ద్వారా 8 లక్షల మంది దివ్యాంగులతో సహా సుమారు 64 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ఏడాదికి రూ.33,312 కోట్ల వ్యయాన్ని చేస్తూ ఇప్పటివరకు రూ.29,281 కోట్ల మొత్తాన్ని పంపిణీ చేయడమయింది.
నిరుపేదలకు ఆహార భద్రత కల్పించేందుకు, మేము ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి, ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకుండా ఐదు రూపాయలకే  పౌష్టికాహారం అందించే 204 అన్న క్యాంటీన్లను పునరుద్ధరించడం జరిగింది.
బలహీన వర్గాల విద్య, సామాజిక భద్రత, ఆర్థిక సాధికారతపై దృష్టి సారించి, మేము ఎస్¬సి, ఎస్¬టి, బిసి, మైనారిటీ విద్యార్థులకు ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్¬షిప్¬లను అమలు చేస్తున్నాం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, ఆదాయకల్పన కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారించి రూ.2000 కోట్లను కేటాయిస్తూ ఎస్¬సి, ఎస్¬టి, బిసి, మైనారిటీలకు ఆర్థిక మద్దతు పథకాలను పునరుద్ధరించడం జరిగింది, మేము ఎస్ సి, ఎస్ టి కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను కూడా అందిస్తున్నాం. ఎస్ సిల వర్గీకరణ కోసం, వర్గీకరణ విధివిధానాలను నిర్ణయించడానికి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. 
ముఖ్యంగా 4.93 లక్షల మంది బలహీన గిరిజన సమూహాలతో కలుపుకొని 27.39 లక్షల షెడ్యూల్డ్ తెగల సమగ్ర సామాజిక, ఆర్థిక అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఐటిడిఏ ప్రాంతాలలో గిరిజనుల విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, జీవనోపాధులు, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి వంటి వివిధ రంగాల్లో సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా దీనిని సాధించడమవుతున్నది.
బిసిలు సమాజానికి వెన్నుముకగా ఉన్నారు. వారి ఆర్ధిక, సామాజిక, రాజకీయ సాధికారతకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. బిసి సామాజిక వర్గాల సంక్షేమం కోసం, స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు, ఆదాయం వచ్చే కార్యకలాపాల కోసం వివిధ కార్పొరేషన్లకు రూ.896 కోట్ల మొత్తాన్ని విడుదల చేయడంతో సహా పలు కీలక కార్యక్రమాలను మేము అమలు చేయడం జరిగింది. అదనంగా, రాష్ట్ర శాసనసభలో బిసిలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపించడమయింది. స్థానిక సంస్థలు మరియు నామినేటెడ్ పోస్టులలో 34 శాతం రిజర్వేషన్లను కల్పించే దిశగా మేము పనిచేస్తున్నాం. ఈ సామాజిక వర్గానికి దీర్ఘకాలిక సంక్షేమం మరియు హక్కులు కల్పించేలా చూస్తూ, ప్రత్యేక బిసి పరిరక్షణ చట్టాన్ని చేయడం కోసం మేము రోడ్ మ్యాప్¬ను రూపొందించాం.  

మేము ఆలయ అర్చకుల గౌరవ వేతనాన్ని రూ.15,000/-లకు, నాయీబ్రాహ్మణుల గౌరవ వేతనాన్ని రూ.25,000/-లకు పెంచడం జరిగింది. నిరుద్యోగ వేద విద్యార్థులకు నెలకు రూ.3,000/-ల భత్యాన్ని ఇవ్వడమవుతున్నది. వరుసగా రూ.10,000/-, రూ.5,000/- చెల్లిస్తున్న ఇమామ్¬లు, మౌజాన్లకు పెండింగులో ఉన్న గౌరవ వేతనాలను ఇటీవల విడుదల చేయడం జరిగింది. 
మహిళల సంక్షేమం కోసం, మా ప్రభుత్వం దీపం-2 పథకాన్ని ప్రవేశపెట్టింది, ఇది సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తుంది, ఇది అవసరమైన వంట ఇంధనం అందుబాటులో ఉండేలా చేస్తుంది మరియు జీవన నాణ్యతను పెంచుతుంది, ముఖ్యంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాల్లోని మహిళల జీవన నాణ్యతను పెంచుతుంది. ఇందువల్ల ఇప్పటివరకు రూ.686 కోట్ల మొత్తం పంపిణీతో ఇప్పటికే 86.50 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరింది. 
పేరిట అవసరమైనచోట ఇంటి స్థలాలను తగువిధంగా సమకూరుస్తూ సంతృప్తత విధానంలో 2029 చివరి నాటికి రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలన్నింటికీ శాశ్వత గృహాలను సమకూర్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. గత 8 నెలల్లో రూ.642.38 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేసి, పిఎంఏవై అర్బన్ - బిఎల్¬సి : 76585 గృహాలు, పిఎంఏవై గ్రామీణ : 37746 గృహాలు మరియు పిఎం జన్¬మన్-305 గృహాల క్రింద 1.14 లక్షల గృహాలను పూర్తి చేయడమయింది. ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం, పక్కా ఇల్లు, మరుగుదొడ్డి, స్వచ్ఛమైన నీరు, వంటగ్యాస్, విద్యుత్, సుస్థిర ఇంధనం కోసం సోలార్ పైకప్పు కూడా అందుబాటులో ఉండేలా చూడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. భూమి లేని కుటుంబాలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమిని సమకూరుస్తూ  పెండింగ్¬లో ఉన్న 6.34 లక్షల ఇళ్లను పూర్తి చేసేందుకు మేము చురుగ్గా పనిచేస్తున్నాం. మా ప్రభుత్వం మొదటి సంవత్సరం పూర్తయ్యే నాటికి పట్టణ మరియు గ్రామీణ పేదల కోసం 4 నుండి 5 లక్షల ఇళ్ళను పూర్తి చేయనున్నాం.     
 ప్రతి కుటుంబం అవసరమైన సేవలు ,  మద్దతును సమర్థవంతంగా పొందేలా చూస్తూ పథకం ప్రయోజనాలు మరియు ఇతర సంక్షేమ చర్యల పంపిణీని క్రమబద్ధీకరించడానికి, నా ప్రభుత్వం ఫ్యామిలీ బెనిఫిట్ కార్డును ఆవిష్కరించాలని యోచిస్తోంది.  ఎవరైనా ఒక మనిషికి ఒక చేపను ఇస్తే, అది అతనికి ఒక రోజు తిండి పెట్టినట్లవుతుంది. అదే మనిషికి చేపలు పట్టడం నేర్పితే, జీవితాంతం తిండి పెట్టినట్లవుతుంది అనే సూక్తిని గౌరవ ముఖ్యమంత్రి  గట్టిగా సమర్థిస్తున్నారు. అర్హులైన పౌరులందరికీ అవసరమైన నైపుణ్యాలు, అవకాశాలను సమకూరుస్తూనే వారి ప్రయోజనాలను సకాలంలో పొందేలా వ్యవస్థను ప్రభుత్వం రూపొందిస్తున్నది. 
సంప్రదాయ సంక్షేమ పథకాలతో పాటు, నా ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం ఒక ప్రత్యేకమైన విధానాన్ని రూపొందిస్తోంది, ఇక్కడ అధిక-నికర విలువ కలిగిన వ్యక్తులు  అవసరార్ధులకు, నిరుపేదలకు అండగా ఉంటారు. సమాజ అభ్యున్నతి యొక్క ఈ లక్ష్యాన్ని సాధించడానికి, మన ప్రజలను విలువైన ఆస్తులుగా గుర్తిస్తూ మరియు మెరుగైన జీవన ప్రమాణాలకు ప్రాధాన్యత ఇస్తూ మన గౌరవనీయ ముఖ్యమంత్రిగారిచే రూపొందించబడిన ప్రభుత్వ-ప్రైవేటు-ప్రజల భాగస్వామ్యం అనే ఒక వినూత్న పీ4 విధానానికి మేము నాంది పలుకుతున్నాం. అట్టడుగున ఉన్న ఇరవై శాతం మందికి మద్దతు ఇవ్వడానికి మన జనాభాలోని అగ్రస్థాయిలోని పది శాతం మందిని నిమగ్నం చేయడం ద్వారా, పేదరికం నుండి స్థిరమైన మార్గాలకు మార్గం సుగమం చేస్తూ సమాజంలోని అత్యంత బలహీన వర్గాలకు లక్షిత సహాయాన్ని అందించేలా చూస్తుంది. 
ఈ విధంగా, సమష్టి దార్శనికత, ఆలోచనలు, అంకితభావంతో కూడిన కార్యక్రమాలు స్థూల స్థాయిలో ప్రణాళికలు రచించి, సూక్ష్మస్థాయిలో అమలు చేయడం ద్వారా ప్రతి పౌరుడికి సుసంపన్నమైన, స్వావలంబన, గౌరవప్రదమైన భవిష్యత్తును నిర్ధారిస్తూ పేదరికంలేని సమాజం దిశగా ఆంధ్రప్రదేశ్¬ను నడిపిస్తున్నాయి.
 సుస్థిర ఆర్థిక వృద్ధికి మరియు మానవ వనరుల అభివృద్ధికి నైపుణ్యం, ఆరోగ్యకరమైన శ్రామిక శక్తి మూలస్తంభమని నా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తుంది. ఈ దార్శనికతకు అనుగుణంగా విద్య, ఆరోగ్య రంగాలపై వ్యూహాత్మక దృష్టి సారించడం ద్వారా మానవ వనరుల సామర్థ్యాన్ని మేము బలోపేతం చేస్తున్నాం.
 సృజనాత్మక   వ్యయ ప్రభావక పరిష్కారాలతో నివారణ మరియు నిర్మూలన అనే ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టితో డిజిటల్ పరిజ్ఞానం మరియు సృజనాత్మక జోక్యాలను ఉపయోగించడం ద్వారా నా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. సుమారు రూ.1770 కోట్ల మేర పెండింగ్ లో ఉన్న అప్పులను తీర్చి, ఎన్-టిఆర్ వైద్యసేవ, ఉద్యోగుల ఆరోగ్య పథకం వంటి కీలక పథకాలను పునరుద్ధరించడం జరిగింది. మా ఎన్ డిఏ ప్రభుత్వం హైబ్రిడ్ ఆరోగ్య బీమాను ప్రతిపాదిస్తున్నది. ఇందులో రూ.2.5 లక్షల క్లెయింలను ఇన్సూరెన్స్ పార్ట్ నర్ రీయింబర్స్ చేస్తారు. రూ.2.5 లక్షలకు మించి రూ.25 లక్షల వరకు గల క్లెయింలను ఎన్.టి.ఆర్ వైద్య సేవా ట్రస్టు రీయింబర్స్ చేస్తుంది. ప్రతి శానససభ నియోజకవర్గంలోనూ 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడం కోసం ఒక విధానాన్ని రూపొందించాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముందస్తు చొరవకు వీలు కల్పిస్తూ హైపర్ టెన్షన్, డయాబెటీస్ వంటి వేలాది కొత్త కేసులను మరియు సంభావ్య క్యాన్సర్ కేసులను గుర్తిస్తూ 92.4 లక్షల మంది వ్యక్తులకు ఇప్పటికే ఆరోగ్య పరీక్షలను నిర్వహించడమయింది. 
వ్యవసాయం, ఆహారపు అలవాట్లు మరియు ఆరోగ్యం మధ్య అనుసంధానంపై దృష్టి పెట్టడం ద్వారా మన జనాభా యొక్క మారుతున్న ధోరణులను కూడా మేము పరిష్కరిస్తున్నాం. ప్రోటీన్ అధికంగా ఉండే గుడ్లు మరియు సేంద్రీయ ఉత్పత్తులు వంటి ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలను ప్రజలు ఎక్కువగా ఎంచుకుంటున్నారు మరియు ఆంధ్రప్రదేశ్ ఈ మార్పులో అగ్రగామిగా ఉంది. సాంకేతికత, నివారక సంరక్షణ మరియు సంపూర్ణ ఆరోగ్య విధానాలను సమ్మిళితం చేయడం ద్వారా, మేము ఆరోగ్యకరమైన, మరింత సమర్ధవంతమైన సమాజాన్ని నిర్మిస్తున్నాం, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాం.

మన సమాజ మూలాలను పటిష్టపరచడానికి ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర విద్యా సంస్కరణలను నా ప్రభుత్వం అమలు చేస్తున్నది. సామాజిక భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా మేము దేశంలోనే మొట్టమొదటి మెగా పేరెంట్-టీచర్ మీటింగ్¬ను నిర్వహించాం. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు 'డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం' అనే మధ్యాహ్న భోజన కార్యక్రమానికి మేము తిరిగి రూపకల్పన చేశాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కార్యక్రమం ద్వారా 35.94 లక్షల మంది విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించనున్నాం. 'మనబడి – మన భవిష్యతు' వంటి కార్యక్రమాల ద్వారా మేము మౌలిక సదుపాయాలను ఆధునీకరిస్తున్నాం.
జాతీయంగా, అంతర్జాతీయంగా వేగంగా మారుతున్న సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా పాఠ్యాంశాలను రూపొందించేలా చూస్తూ ఉన్నత విద్యలో అంతర్జాతీయ స్థాయి సంస్కరణలను ప్రవేశపెట్టాం. ఈ సంస్కరణలకు అనుగుణంగా ఉన్నత ప్రమాణాలను పెంపొందించేందుకు కొత్త దృక్పథాలను, నాయకత్వాన్ని తీసుకువస్తూ ఉన్నత విద్యను క్రమబద్ధీకరించడానికి, సుస్థిర కార్యవిధానాలను అనుసరించి, పూర్తిగా ప్రతిభ ఆధారంగా మేము 9 విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను నియమించాం.  

ఆంధ్రప్రదేశ్ గణనీయమైన జనాభా పరివర్తనలకు లోనవుతోంది, వీటిలో సంతాన సాఫల్యత రేటు (టిఎఫ్ఆర్) లో తీవ్రమైన క్షీణత మరియు వృద్ధాప్య జనాభా వేగంగా పెరగడం, సాంప్రదాయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థల క్షీణత చేరి ఉన్నాయి, ప్రతి ఒక్కటి దీర్ఘకాలంలో ప్రభావం చూపే అంశమే.   'డెమోగ్రాఫిక్ మేనేజ్ మెంట్' పై ఒక విధానాన్ని ప్రారంభించడం ద్వారా తగ్గుతున్న శ్రామిక శక్తి, వృద్ధాప్య జనాభా, మారుతున్న కుటుంబ ధోరణుల పర్యవసానాల పరిష్కారానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇద్దరు పిల్లలు మించకూడదు అనే నిబంధనను మేము  రద్దు చేశాం. అంతేకాకుండా, మా హామీలకు అనుగుణంగా పిల్లల చదువులు కుటుంబానికి భారంగా మారకుండా తల్లులకు ఆర్థిక చేయూతనిస్తూ 'తల్లికి వందనం' పథకాన్ని అమలు చేయబోతున్నాం.

దూరదృష్టి, లక్ష్యసాధనతో, సుస్థిర ఆర్థికాభివృద్ధికి పునాది వేస్తూ ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధిశాఖ సమర్థవంతమైన జనాభా నిర్వహణను ప్రోత్సహిస్తున్నది. విద్య, నైపుణ్యాల పెంపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వ్యూహానికి కేంద్ర బిందువులు. నైపుణ్యాల ఆఫ్ లైన్, ఆన్ లైన్ అప్ గ్రేడేషన్ పై దృష్టిసారిస్తూ స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రజల నైపుణ్యాలను గుర్తించడానికి రాష్ట్రం మొట్టమొదటిసారిగా నైపుణ్య గణనను నిర్వహిస్తోంది. 
అభివృద్ధికి 'ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త' అనే అంశంపై దృష్టిసారిస్తూ ఉపాధికల్పనకు బలమైన పునాది వేయడమే మా ప్రభుత్వ సమగ్ర విధానం. ఆత్మగౌరవం, ఆర్థిక స్థిరత్వం రెండింటినీ తీసుకొచ్చే వృత్తులకు విలువనిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎల్లప్పుడూ స్వీయ సంతృప్తికరమైన పనిని స్వీకరించడం జరిగింది. వారి వ్యవస్థాపక స్ఫూర్తి వారిని అవకాశాలను చురుకుగా ఉపయోగిం చుకో వడానికి ప్రేరేపిస్తుంది, నైపుణ్యాలను స్థిరమైన జీవనోపాధిగా మారుస్తుంది. 

నైపుణ్యాలను పెంపొందించడానికి, మేము నైపుణ్య బదిలీ నమూనాను అనుసరిస్తున్నాం. దీని కింద స్థానిక పరిశ్రమ అవసరాలను తీర్చడానికి  నిరుద్యోగ యువత, కళాశాల డ్రాపవుట్ లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వ ఐటీఐలు, పాలిటెక్నిక్ లు, డిగ్రీ కళాశాలల్లో 200 స్కిల్ హబ్ లను ఏర్పాటు చేశాం. మనం ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రిగారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి సారించారు. ఈ కార్యక్రమం క్రింద, 4,700 ఎకరాల్లో 800పైగా భూ కేటాయింపులను విజయవంతంగా నిర్వహించి, రూ.78,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 48,789 ఉద్యోగాలను కల్పించడం జరిగింది.

 కీలక ఉపాధికల్పన రంగంగా ఉన్న పర్యాటకం అభివృద్ధిలో సాధికారత తీసుకురావడంలో, సుస్థిర వృద్ధిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ 2024-29 రాష్ట్రం  సాంస్కృతిక వారసత్వం, సహజ సౌందర్యం, వైద్యం,  ఎకో టూరిజం సామర్థ్యాలను ఉపయోగిం చుకోవడం ద్వారా రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా మార్చాలని భావిస్తున్నది. పర్యావరణ ప్రభావాన్ని తగ్గించేందుకు గ్రీనరైజేషన్ కార్యకలాపాలను ఏకీకృతం చేస్తూ సుస్థిర పర్యాటకంపై రాష్ట్రం దృష్టిసారిస్తున్నది. ఎంఎస్ఎంఈలు, టెక్స్ టైల్స్, పర్యాటకం వంటి అధిక వృద్ధి రంగాలపై దృష్టిసారిస్తూ బ్లూ, వైట్ కాలర్ ఉద్యోగాలతో సహా అన్ని కేటగిరీల్లో ఉపాధిని కల్పించడం ఆంధ్రప్రదేశ్ సమగ్ర వ్యూహంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ టెక్స్ టైల్స్, అపెరల్ అండ్ గార్మెంట్ పాలసీ 2024 ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో ఐదు టెక్స్ టైల్ పార్కుల ద్వారా ఐదేళ్లలో రూ.10,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం,  2 లక్షల ఉద్యోగాలను కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. 

అట్టడుగున ఉన్న సంప్రదాయ వృత్తులకు మద్దతును అందించే మా చర్యలలో భాగంగా  మా ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నది.  గీత కులాల వారి కోసం మా సర్కార్  10 శాతం దుకాణాలను రిజర్వు చేసి, రాయితీతో కూడిన 50 శాతం వార్షిక రిటైల్ ఎక్సైజ్ పన్ను   అందించాం. నైపుణ్యం కలిగిన ప్రతి కార్మికుడు, పారిశ్రామికవేత్త తాము ఎంచుకున్న రంగంలో అభివృద్ధి చెందడానికి అవసరమైన మద్దతును పొందేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. 

ఆంధ్రప్రదేశ్ ఐటి ,  జిసిసి పాలసీ (2024–2029) ఆర్థిక వృద్ధి, ఆవిష్కరణ మరియు సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా  ఐటి రంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకుంది.  డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, వర్క్ ఫ్రమ్ హోమ్, కో-వర్కింగ్ స్పేసెస్, డేటా ఆధారిత గవర్నెన్స్ కి ఈ విధానం ప్రాధాన్యత ఇస్తుంది.
ఇలాంటి వ్యూహాత్మక చొరవలు, అచంచలమైన నిబద్ధత ద్వారా, ఆంధ్రప్రదేశ్ ఉపాధి, అధునాతన నైపుణ్యానికి కేంద్రంగా రూపాంతరం చెందుతున్నది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్ యువతకు ఉపాధి కల్పించడానికి లేదా ఉపాధి భత్యం ఇవ్వడానికి మేము కట్టుబడి  ఉన్నాం.

ప్రతి ఇంటికి తాగునీరు అందించడం, సమాన పంపిణీ, వ్యవసాయ స్థితిస్థాపకత కోసం నదుల అనుసంధానం, సంరక్షణ చర్యల ద్వారా అన్ని రంగాల్లో నీటి వినియోగాన్ని గరిష్టతరం చేయడాన్ని కట్టుదిట్టం చేస్తూ నీటి సురక్షితకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.  ఇందు కోసం కొత్త రాష్ట్ర జల విధానాన్ని రూపొందించనుంది.

గత ప్రభుత్వం సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. సాగునీటి ప్రాజెక్టులు , మౌలిక సదుపాయాలను పూర్తిగా ఉపేక్షించింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలలోని ప్రాజెక్టులన్నీ గత ప్రభుత్వ హయాంలో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీనిపై మా ప్రభుత్వం తిరిగి దృష్టిసారించి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పోలవరానికి అనుసంధానం చేస్తున్నది. జగన్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కింది.  2027 నాటికి   పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో  మా ప్రభుత్వం ఉంది. 

కరవు రహిత రాష్ట్ర లక్ష్యాన్ని సాధించే దిశగా, మా ప్రభుత్వం పోలవరం నుండి  బనకచెర్ల నది అనుసంధాన ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఈ ప్రాజెక్టు లింక్ కాలువ ద్వారా గోదావరి నది నుండి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ కు నీటిని బదిలీ చేస్తుంది.  అమృత్  అండ్ జల్ జీవన్ మిషన్ (జెజెఎం) అమలు గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయింది.  దీనిని ఇప్పుడు   మా  ప్రభుత్వం పునరుద్ధరించింది. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో, ప్రతీ కుటుంబానికి కుళాయి నీరు అందేటట్లు చేయడానికి గానూ, నిధులను వినియోగించుకోవాలనీ, 95.44 లక్షల గ్రామీణ కుటుంబాలన్నింటికీ వర్తింప చేయాలని మా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.

రాయలసీమకు కీలకమైన హంద్రీనీవా సుజల స్రవంతి వంటి ఇతర కీలక ప్రాజెక్టులు 1వ దశలో 94 శాతం, 2వ దశలో 82 శాతానికి చేరుకున్నాయి, ఇవి సుమారు 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు, 437 గ్రామాల్లోని సుమారు 33 లక్షల మందికి తాగునీరు అందిస్తాయి. 
జలహారతి కార్యక్రమం ద్వారా, ప్రతి ఎకరానికీ సాగునీరు అందిస్తూ, దానిని భూమాతకు అర్పణగా పరిగణిస్తూ రైతుల శ్రేయస్సుకు, ఆశలకు ప్రతీకగా నిలుస్తూ, మేము నదులు, జలాశయాలకు పూజలు చేస్తున్నాము. 

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, పద్ధతులను అవలంబించాలనే తపనతో ఉన్న  అభ్యుదయ రైతులకు ఆంధ్రప్రదేశ్ ఎల్లప్పుడూ నిలయంగా ఉంది. అయితే, గత ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా రైతులు కష్టాల పాలయ్యారు. ఇప్పుడు మా ప్రభుత్వ హయాంలో   ఏ రైతు కూడా కష్టాల్లో లేరని చెప్పడానికి   గర్విస్తున్నాము. రుతుపవనాలకు ముందు, తరువాత నీటి లోతు స్థాయిలపై దృష్టి సారించి భూగర్భ జలాల రీఛార్జ్ కు తగిన ప్రణాళిక లు రూపొందించి అమలు చేయడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించడానికి మా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.   

 ఆంధ్రప్రదేశ్ లో గంజాయి మరియు మాదకద్రవ్యాల స్మగ్లింగ్¬ను అరికట్టేందుకు ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్¬ఫోర్స్¬మెంట్ (ఈఎజిఎల్ఇ), విద్యాసంస్థలు మరియు యువతపై దృష్టిని సారిస్తోంది. మా ప్రభుత్వం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, గంజాయి అక్రమ రవాణా మరియు మహిళలపై నేరాలు వంటి సంఘ విద్రోహ శక్తులను ముందస్తుగా నియంత్రించడం మరియు అటువంటి దుర్మార్గపు చర్యలను నిర్మూలించడానికి తగిన పద్దతులను తీసుకురావడం ద్వారా వాటిని పరిష్కరిస్తోంది.   కలిసికట్టుగా పనిచేద్దాం, కలిసి నిర్మించుకుందాం, కలిసి ఎదుగుదాం, ఆంధ్రప్రదేశ్ ను భారతదేశానికే కాదు, ప్రపంచానికే ఒక అభివృద్ధి మార్గదర్శిగా నిలిచేలా చేద్దాం.

జై హింద్!
జై ఆంధ్ర!
జై జై స్వర్ణాంధ్ర!

ప్రభుత్వ పనితీరుకు పట్టం కట్టిన పంచాయతీ ఫలితాలు.. సీఎం రేవంత్

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మంత్రులతో కలిసి గురువారం (డిసెంబర్ 17) మీడియాతో మాట్లాడిన ఆఈయన ఈ రెండేళ్లలో తమ ప్రభుత్వ పని తీరుకు పంచాయతీ ఎన్నికలు రిఫరెండంగా ఆయన అభివర్ణించారు.  పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన అధికారులను అభినందించిన ఆయన ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, అలాగే పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు.  మొత్తం 12 వేల 702 పంచాయతీల్లో 7 వేల 527 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ విజయం సాధించిందనీ, అంటే 66శాతం స్ట్రైక్ రేట్ సాధించిందనీ చెప్పిన రేవంత్, బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కైపోటీ చేశాయనీ, అయినా కూడా రెండు పార్టీలూ కలిపి 33 శాతం పంచాయతీల్లోనే గెలిచాయని రేవంత్ అన్నారు.   పంచాయతీ ఎన్నికల్లో 808 మంది కాంగ్రెస్ రెబల్స్ గెలిచారన్న రేవంత్ రెడ్డి వారిని కూడా కలుపుకుంటే కాంగ్రెస్ మొత్తం 8 వేల 335 పంచాయతీలలో జెండా పాతిందన్నారు.  ఈ ఫలితాలను బట్టి చూస్తే.. ఎన్నికలు జరిగిన 94 అసెంబ్లీ సెగ్మెంట్లలో 87 సెగ్మెంట్లలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత కనబరిచిందన్నారు.  అంటే  2028 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మూడింట రెండు వంతుల మెజారిటీతో అధికారంలోకి వస్తామని స్పష్టమౌతోందన్నారు.  2028 ఎన్నికలలో రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ తీసేయగలరా?!

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పు విషయంలో కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్ర ఆగ్రహం, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గ్రామీణ భారతం ఆకలితో అలమటించేలా కేంద్రంలోని మోడీ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటోందంటూ దుమ్మెత్తి పోస్తున్నాయి. కేంద్రం ఈ పథకంలో ఉన్న లోపాలను సవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది. పేదలకు ఉపాధి కల్పించే బాధ్యత నుంచి వైదొలగుతోందని దుమ్మెత్తి పోస్తున్నది. ఈ నేపథ్యంలోనే  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బీజేపీకి ఓ సవాల్ విసిరారు.  జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగిస్తున్నారు సరే.. భారత కరెన్సీ నోట్ల మీద నుంచి గాంధీ బోమ్మను తొలగించగలరా?  అని చాలెంజ్ చేశారు. బీజేపీ ప్రమాదకరమైన ఆట ఆడుతోందనీ, దేశ సమగ్రత, సామరస్యానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నదని డికే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. జగన్ పై చంద్రబాబు విజయం!?

తెలంగాణలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతను కనబరిచింది. గత అసెంబ్లీ ఎన్నికలనాటి కంటే అధికంగా కాంగ్రెస్ కు ఓటింగ్ శాతం నమోదైంది. ఇక రెండో స్ధానంలో బీఆర్ఎస్ నిలిచింది. బీజేపీ ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే మిగిలిందని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. అవన్నీ పక్కన పెడితే ఈ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో ఓ ఆసక్తికర విషయంపై   తెలుగు రాష్ట్రాలలో చర్చ మొదలైంది. అదేంటంటే మూడో విడత ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత సోషల్ మీడియాలో తెలంగాణ పంచాయతీ ఎన్నికలలో జగన్ పై చంద్రబాబు విజయం అంటూ ఓ వార్త తెగ వైరల్ అయ్యింది. ఇదేంటి ఎన్నికలు జరిగింది తెలంగాణలో  ఆ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిపై గెలవడమేంటి? అన్న ఆసక్తి కలిగించేలా సోషల్ మీడియాలో వార్త  హల్ చల్ చేసింది. ఇంతకీ విషయమేంటంటే..  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు మండలం గుండ్లరేవు గ్రామ సంర్పంచ్ పదవికి పోటీ పడిన వారిలో ఒకరి పేరు భేక్య చంద్రబాబు కాగా, మరో వ్యక్తి పేరు బానోత్ జగన్నాథమ్. ఈ పేర్లే ఈ ఎన్నికను ఆసక్తిగా మార్చేశాయి.  ఈ ఎన్నికలో   భూక్య చంద్రబాబు  బానోత్ జగన్నాథమ్  బానోత్ జగన్నాథమ్ పై విజయం సాధించారు.  దీనిపైనే నెటిజనులు తెలంగాణలో కూడా జగన్ ను చంద్రబాబు ఓడించారు అంటూ సెటైరిక్ గా పోస్టులు పెట్టారు. ఈ పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.  

సీఎం చంద్రబాబు హస్తిన పర్యటన ఎందుకంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటన కోసం ఆయన ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి బయలు దేరుతున్నారు. ఈ సారి చంద్రబాబు పర్యటన లక్ష్యం.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన పోలవరం -నల్లమల సాగర్ ప్రాజెక్టులకు అనుమతుల సాధనే అంటున్నారు. నల్లమల సాగర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణా జలవనరులశాఖ అధికారులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో చంద్రబాబు  ప్రధాని మోడీ,  జలవనరులశాఖ మంత్రి సిఆర్‌ పాటిల్‌ తో వేర్వేరుగా భేటీ కానున్నారు.నల్లమల సాగర్‌కు అనుమతులతో పాటు, పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఈ పర్యటనలో కేంద్రాన్ని సిఎం కోరనున్నట్లు తెలుస్తోంది. 

పార్లమెంటు ఆవరణలో ఇండియా కూటమి ఎంపీల నిరసన

కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీల ఎంపీలు నిరసనకు దిగారు. ఈ పథకం పేరుమార్పునకు వ్యతిరేకంగా  కాంగ్రెస్ సహా విపక్ష నేతలు పార్లమెంట్ ఆవరణలో ధర్నాకు దిగారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పు అన్నది గ్రామీణ పేదల జీవనాధారంపై జరుగుతున్న దాడిగా ఎంపీలు అభివర్ణించారు.   కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత కొన్నేళ్లుగా   ఉపాధి హామీ  పథకానికి నిధులను నిలిపివేస్తూ, పనులను నిరాకరిస్తూ, గ్రామీణ ప్రజలు ఆకలితో అలమటించేలా చేస్తోందని ఆరోపించారు.  ఉపాధి హామీ పథకాన్ని ఇప్పటికే  ఆచరణలో బలహీనపరిచిన ప్రభుత్వం, ఇప్పుడు దాని ఉనికినే  దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.

ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ భగ్గు.. బీజేపీ కార్యాలయాల ముట్టడి

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చాలన్న మోడీ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడి జరుగుతోంది. అఖిల భారత కాగ్రెస్ కమిటీ పిలుపు మేరకు గురువారం (డిసెంబర్ 18)  దేశ వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల మట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.  తెలంగాణలో కూడా  రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలోనే  అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆఫీసుల వద్ద డీసీసీల నేతృత్వంలో కాంగ్రెస్ ధర్నాలకు దిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో గాంధీ భవన్, బీజేపీ కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుతో పాటు, నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్రం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను వేధిస్తోందని కాంగ్రెస్  నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.    బీజేపీ కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వడంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమ కార్యాలయాలు ముట్టడిస్తామంటే ఊరుకునేది లేదని, ప్రతిఘటిస్తాం, తాటా తీస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు. 

షర్మిలకు బర్త్ డే విషెస్ చెప్పని జగన్.. కారణమేంటంటే?

జగన్.. సొంత చెల్లికి కనీసం బర్త్ డే విషెస్ కూడా చెప్పని వ్యక్తిగా మరోసారి వార్తలలో నిలిచారు. ఔను జగన్ చెల్లెలు షర్మిల బుధవారం (డిసెంబర్ 17) తన జన్మదినం జరుపుకున్నారు.  జగనన్న వదిలిన బాణాన్ని అంటూ తన అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి తన వంతు దోహదం చేసిన చెల్లిని అధికారం చేపట్టిన తరువాత జగన్ దూరం పెట్టారు. ఆస్తుల పంచా యితీతో పాటుగా రాజకీయంగా తనకు పోటీ అవుతుందన్న భయంతోనే జగన్ షర్మిలను దూరం పెట్టారన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది.   దీంతో షర్మిల తన మకాం హైదరాబాద్ కు మార్చి కొంత కాలం వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రిగా తెలంగాణ రాజకీయాలలో కీలక భూమిక పోషించారు. అయితే..  గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ గూటికి చేరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతే కాకుండా గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. 2019 ఎన్నికలలో జగన్ విజయంలో షర్మిల కీలక పాత్ర పోషిస్తే.. 2024 ఎన్నికలలో జగన్ ఓటమిలో కూడా ఆమె తన వంతు పాత్ర పోషించారని పరిశీలకులు విశ్లేషణలు కూడా చేశారు.  ఈ పోలిటికల్ డిఫరెన్సెస్ కు తోడు.. జగన్ షర్మిల మధ్య ఆస్తి వివాదాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సరస్వతి పవర్ వాటాల బదలీ వ్యవహారంలో వీరి మధ్య ట్రైబ్యునల్ లో కేసు కూడా నడుస్తోంది.  అది పక్కన పెడితే.. కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల తనవంతు పాత్ర పోషిస్తున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, వైసీపీలపై ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంలో ఆమె తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్ గొంతును బలంగా వినిపిస్తున్నారు. అందులో తప్పుపట్టాడినికి ఏమీ లేదు.   కాగా షర్మిల జన్మదినం సందర్భంగా కూటమి నేతలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. వారికి షర్మిల ధన్యవాదాలు తెలుపుతూ బదులిచ్చారు కూడా.  అయితే సొంత అన్న జగన్ షర్మిలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయకపోవడం సరికాదని వైసీపీ వర్గాలలోనే చర్చ జరుగుతోంది. తెల్లారి లేస్తే గాంధీ డైనాస్టీ అంటూ.. సోనియా, రాహుల్, ప్రియాంకలపై విమర్శలతో విరుచుకుపడే ప్రధాని నరేంద్ర మోడీ వారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేస్తుంటారు. అంతెందుకు నిత్యం చంద్రబాబుపై ఏక వచన ప్రయోగంతో విమర్శలు గుప్పించే జగన్ కు కూడా చంద్రబాబు జగన్ పుట్టిన రోజు సందర్భంగా బర్త్ డే విషెస్ చెప్పారు. తద్వారా వారంతా విభేదించడం, భిన్నాభిప్రాయం కలిగి ఉన్నంత మాత్రాన వ్యక్తిగత వైరం ఉండనవసరం లేదని చాటారు. కానీ జగన్ మాత్రం రాజకీయంగానైనా, కుటుంబ పరంగానైనా సరే తనతో విభేదించిన వారిని శత్రువులుగా చూస్తారనడానికి సొంత చెల్లికి బర్త్ డే విషెస్ తెలపకపోవడాన్ని ఉదాహరణగా చూపు తున్నారు పరిశీలకులు. 

మూడో విడతలోనూ ‘హస్తం’దే పై చేయి!

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో జరిగిన సంగతి తెలిసిందే. మూడు దశల్లోనూ కూడా కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. మూడో దశలో 4,158 స్థానాల్లో ఎన్నికలు జరగగా, 2,286 పంచాయతీల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు.  మూడు దశల్లో కలిపి 12,726 పంచాయతీలకు ఎన్నికలు జరగగా, కొన్ని మినహా అన్ని స్థానాల్లో ఫలితాలు వచ్చాయి. వీటిలో 7,093 పంచాయతీల్లో  కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. 3,488   స్థానాలలో విజ యం సాధించి బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచి ఉనికి చాటుకుంది.  బీజేపీ 699  స్థానాలలో గెలిచి నామమాత్రపు ప్రభావాన్ని చూపింది.   అదలా ఉంటే మూడో దశలో బుధవారం (డిసెంబర్ 17) మొత్తం 4,159 స్థానాలకుఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారలు 2,286 స్థానాలు గెలుచుకున్నారు. బీఆర్ఎస్ 1,142, బీజేపీ 242, ఇతరుఅు 479 సానాల్లో విజయం సాధించారు. ఇతరుల్లో సీసీఐ మద్దతుదారులు 24 , సీపీఎం 7 స్థానాలలో విజయం సాధించారు. మూడో విడత ఎన్నికల్లో సిద్దపేట మినహా మిగిలి30 జిల్లల్లోనూ  కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగింది.  కాగా,  పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల తర్వాత అత్యధిక స్థానాలు దక్కించుకున్నది స్వతంత్రులే. స్వతంత్రులే సుమారుగా 10శాతం సీట్లను గెలుచుకున్నారు. అయితే అలా గెలిచిన వారిలో   80 శాతం మంది కాంగ్రె‌స్ రెబల్సే కావడం గమనార్హం. పంచాయతీ ఎన్నికలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులూ ఈ ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి పనిచేయడం సత్ఫలితాలను ఇచ్చింది. మూడో విడత పంచాయతీ పోలింగ్ లోనూ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.  మూడో విడతలో 85.77 శాతం పోలింగ్‌ నమోదైంది. రెండో విడతతో పోలిస్తే ఇది   0.9 శాతం తక్కువ. కాగా మూడు విడతలూ కలిసి మొత్తం 85.30 శాతం ఓటింగ్ నమోదైంది. చివరి మూడో విడతలో యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 92. 56 శాతం ఓటింగ్ జరగగా,  నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా 76.45 శాతం పోలింగ్‌  జరిగింది. ఇలా ఉండగా నూతనంగా ఎన్నికైక సర్పంచ్ లు  ఈ నెల 22న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముందుగా ప్రకటించిన మేరకు డిసెంబర్ 20న ముహూర్తం మంచిగా లేదంటూ ఎన్నికైన సర్పంచ్ లు తెలపడంతో ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ఈ నెల 22కు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.20న ముహూర్తం సరిగా లేదని కొత్తగా ఎన్నికైన సర్పంచులు,వార్డు సభ్యులు కోరడంతో ప్రభుత్వం తేదీని మార్చినట్లు తెలిపింది.

మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభంజనం

  తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు ప్రభంజనం సృష్టిస్తోంది. మూడోవంతు సర్పంచ్ స్థానాలను హస్తం పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్‌ఎస్ పార్టీ, బీజేపీ కలిపినా 30 శాతం కూడా దాటలేదు. మొత్తం 4,158 స్థానాల్లో ఎక్కువ చోట్ల గెలిచి ఆధిక్యాన్ని చాటారు. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్‌ భూపాల్‌పల్లి, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, నాగర్‌ కర్నూల్‌, నల్గొండ, నిజామాబాద్‌, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్‌, కామారెడ్డి, ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్‌ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు.  రాత్రి 8 గంటల వరకు కాంగ్రెస్‌ పార్టీ ఏకగ్రీవాలతో కలిపి 1850, బీఆర్ఎస్ 960, బీజేపీ 180, ఇతరులు 390 సర్పంచ్‌ స్థానాల్లో గెలు పొందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం, గుండ్లరేవు గ్రామంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గుండ్లరేవు గ్రామంలో మూడో దశలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. భూక్యా చంద్రబాబు, బానోత్ జగన్నాథం అలియాస్ జగన్ ఇద్దరు వ్యక్తులు పోటీ చేశారు. ఏపీ రాజకీయ నాయకుల పేర్లతో వీరి పేర్లు ఉండటంతో గ్రామంలో ప్రచారం కూడా ఆసక్తికరంగా జరిగింది. వారి ప్రచారం కూడా 'చంద్రబాబు', 'జగన్' పేర్లతోనే ఎక్కువగా సాగింది. ఈరోజు జరిగిన పోలింగ్‌లో బానోత్ జగన్‌పై భూక్యా చంద్రబాబు విజయం సాధించారు. దీంతో 'జగన్‌పై చంద్రబాబు విజయం' అంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది  

పులివెందులలోనూ కదులుతున్న వైసీపీ పునాదులు!?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో వైసీపీ పునాదులు కదులుతున్నాయా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.  వాస్తవానికి గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీలో నాయకులు, శ్రేణులూ పూర్తిగా డీలా పడ్డాయి. దానికి తోడు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు వలస వెళ్లిపోయి, ఎలాగో తీరిక చేసుకుని వారానికి ఒక సారి మాత్రం ఆంధ్రప్రదేశ్ వచ్చి.. వెడుతున్నారు. దీంతో ఆయన పూర్తిగా పార్ట్ టైమ్ పొలిటీషియన్ గా మారిపోయినట్లైందని పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో వైసీపీ నుంచి వేగంగా వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నాయకులు, జగన్ సన్నిహితులు కమలం గూటికి చేరారు. ఇలా ఉండగా ఎవరెలా వెళ్లిన కడప, మరీ ముఖ్యంగా పులివెందులలో వైసీపీ బలంగా ఉందన్న అభిప్రాయం ఇంత వరకూ కొనసాగుతూ వచ్చింది. ఎప్పుడైతే పులివెందుల జడ్డీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ కనీసం డిపాజిట్ కూడా నోచుకోకుండా ఘోర పరాజయాన్ని చవిచూసిందో.. అప్పుడే పులివెందులలో వైసీపీది వాపేనా, బలం కాదా? అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆ తరువాత పులివెందుల నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీయులు, నియెజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ బీటెక్ రవి సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరడం కూడా పులివెందులలో వైసీపీ బలం సన్నగిల్లిందనడానికి తార్కానంగా నిలిచింది. ఇక తాజాగా జగన్ సన్నిహితుడు,    వేంపల్లిలో వైసీపీ కీలక నేత అయిన చంద్రశేఖరెడ్డి అలియాస్ దిల్ మాంగే వైసీపీకి గుడ్ బై చెప్పి బీటెక్ రవి సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరారు. ఆయనతో పాటు వందల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు కూడా తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వేంపల్లిలో వీరు భారీ ర్యాలీ నిర్వహించారు. వీరి చేరిక కార్యక్రమంలో తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి, స్థానిక తెలుగుదేశం నాయకులు కూడా పాల్గొన్నారు.  ఈ పరిణామంతో పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ పతనం ప్రారంభమైనట్లేనని అంటున్నారు.