గవర్నర్ నరసింహన్‌కీ తప్పని ఈవీఎం గండం!
posted on Apr 30, 2014 @ 10:22AM
తెలంగాణ వ్యాప్తంగా ఓటింగ్ జరుగుతోంది. తెలంగాణలోని చాలా పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. దాంతో చాలా పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ నిలిచిపోవడం, లేదా ఆలస్యంగా ప్రారంభం కావడం జరిగింది. ఈసీఐఎల్ కంపెనీ తయారు చేసిన ఈవీఎంలే మొరాయిస్తున్నాయని ఎన్నికల ప్రధాన అధికారం భన్వర్ లాల్ చెప్పారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా ఈవీఎంల బారిన పడ్డారు. రాష్ట్రానికి ప్రథమ పౌరుడైన ఆయన ఓటు వేయడానికి అందరికంటే ముందున్నారు. రాజ్‌భవన్ ఏరియాలోని ఎం.ఎస్. మక్తాలోని పోలింగ్ కేంద్రనికి గవర్నర్ ఉదయాన్నే తన భార్యతో కలసి వెళ్ళారు. అయితే ఆయన ఓటు వేయడానిక వెళ్ళిన ఈవీఎం మొరాయించింది. దాంతో ఆయన సదరు ఈవీఎంని బాగు చేసేంతవరకూ వేచి వుండి ఆ తర్వాత ఓటు వేశారు.