మగాళ్లకేనా.. మాకూ పైసలెక్కువియ్యండి!
posted on Oct 21, 2022 @ 2:27PM
పెళ్లి పనులకు పిలిపించుకున్నవారికి కావలసినవన్నీ సమకూర్చాల్సిందే..అదనంగా కొంత డబ్బులు, మందు అన్నీను. లేకపోతే వాళ్లు సరిగా పనిచేయరు, ఇతరల్నీ చేయనీయరు. అసలు పని కంటే వీరిని కనిపెట్టుకోవడం పెద్ద పని అవుతుంది పెళ్లివారికి. ఇపుడు మునుగోడులో రాజకీయపార్టీల వారి పరిస్థితి కొంత ఇలానే ఉంది. చిన్నచిన్న పనులు చేయడానికి పెట్టుకున్న రోజూవారి కూలీలు కాస్తంత ఎక్కువ పైసలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అందునా మహిళలు. మగవారితో సమానంగా మాకూ ఇవ్వా లని అంటున్నారు.
అసలే ఓటర్లను ఆకట్టుకోవడంలో, అభ్యర్ధికి భారీప్రచారం చివరి నిమిషం వరకూ ఇంటింటికీ తిరగడం లో బిజీ అయిన లోకల్ నాయకులకు ఇపుడు రోజూవారీ పనులు చేస్తున్న పనివారితో తలనొప్పులు మొదలయ్యాయి. మునుగోడులో అక్కడి పనివారికి రోజూ కూలీతో పాటు లిక్కర్, చికన్ బిర్యానీ తప్పకుండా ఇస్తున్నారు. రోడ్‌షోలు, మిని సమావేశాలు, ఇంటింటికీ ప్రచారంలో సహాయం చేస్తున్న వారికి ఇదంతా బాగా సాగుతోంది. కానీ ఇదే పనులు చేస్తున్న మహిళల విషయంలో అదనంగా ఏమీ ఇవ్వడంలేదని వారు తిరగబడుతున్నారు. వారికి మంచి తిండి పెట్టించాలని, లిక్కర్‌తో పాటు అద నంగా పైసలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఏమి చేసినా, ఏమి డిమాండ్ చేసినా నాలుగు డబ్బులు సంపాదించుకునే సమ యం ఇదేనన్నది వారికి తెలియక కాదు. కానీ వారిని నిర్లక్ష్యం చేస్తున్న ప్రాంతీయ నాయకులకు అది తెలిసేలా చేస్తున్నారు రోజూవారి సహాయకులు. ముఖ్యంగా 50, 60 వయ సులో ఉన్నవారంతా పార్టీలు, నాయ కులతో తేడా లేకుండా వారితో ఎవరు పనిచేయించు కుంటున్నా గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. ఇందులో ఏమాత్రం తగ్గినా అక్కడి పార్టీ ఇన్‌ఛార్జిలతో వాదనకూ దిగుతున్నారు.
మగాళ్లకేమో పైసలిపస్తున్నరు, మందూ పోయిస్తున్నరుగదా..మాకు కనీసం ఇచ్చే పైసలన్నా జర ఎక్కవ ఇయ్యాలిగ.. అని పక్క గ్రామాల నుంచి ఇక్కడ పనులకు వస్తున్న మహిళలు మునుగోడులు రాజకీయ పార్టీల ఇన్‌ఛార్జ్‌లను కదలనీయడం లేదు.
మునుగోడులో లక్షకు పైగా మహిళల ఓటర్లున్న కారణంగా ఈ పర్యాయం వారిని ఆకట్టుకోవడానికి స్వ యం సహాయక గ్రూప్‌లను కూడా రాజకీయపార్టీలు వినియోగించుకుంటున్నాయి. ప్రధాన పార్టీలు మును గోడులో పెద్ద పెద్ద సభలు, సమావేశాలు నిర్వహిస్తు, ఓటర్లను ఆకట్టుకోవడానికి రోజూవారీ కూలీ చెల్లిస్తూ ఎందరో సహాయకులను ఉపయోగించుకుంటున్నాయి.