గిఫ్ట్ డీడ్ రద్దు.. వృద్ధ దంపతులకు న్యాయం!
posted on Jun 20, 2025 @ 10:05AM
ఆస్తిని పిల్లలకు పంచి ఇచ్చేసిన తరువాత చరమాంకంలో పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకపోతే చట్టం చూస్తూ ఊరుకోదని చాటిన ఉదంతమింది. ప్రొద్దుటూరుకు చెందిన మలేపాటి మోహనరావు (86) ఆయన భార్య గౌరమ్మ (75)లు సొంతంగా వ్యాపారం చేస్తూ జీవనం సాగించే వారు. వారికి ఐదుగురు కుమార్తెలు. వయస్సు పై బడిన తరువాత ఆ దంపతులు తమ కుమార్తెలకు ఆస్తిని గిఫ్ట్ డీడ్ ద్వారా పంచి ఇచ్చేశారు.
అప్పటి వరకూ వారిని ఎంతో ప్రేమగా చూసుకున్న కుమార్తెలు ఆస్తి పంపకాల తరువాత పట్టించుకోవడం మానేశారు. వయోవృద్ధులమైన తమకు న్యాయ చేయాలని కోరుతూ ఆ వృద్ధ దంపతులు జమ్మలమడుడు రెవెన్యూ డివిజనల్ అధికారి సాయిశ్రీకి మొరపెట్టుకున్నారు. దీనిపై స్పందించిన సాయిశ్రీ వృద్ధుల సంరక్షణను పిల్లలు పట్టించుకోకపోతే చట్టం చూస్తూ ఊరుకోదు అనే సందేశాన్ని బలంగా ఇచ్చే ఆ వృద్ధ దంపతులు తమ కుమార్తెలకురు కుమార్తెల ఆస్తి పంచి ఇస్తూ చేసిన గిఫ్ట్ డీడ్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్, 2007 చట్టంలోని సెక్షన్ 23 ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు.