మారువేషంలో ఆస్పత్రిలో తనిఖీలు చేసిన సూపరింటెండెంట్.. ఎక్కడో తెలుసా?
posted on Nov 27, 2025 8:31AM
జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ మారువేషంలో ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. ఒక పల్లెటూరి వృద్ధుడి వేషధారణలో ఆయన రాత్రి వేళ ఆస్పత్రికి వచ్చి తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలో రాత్రి వేళల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండటం లేదంటూ ఇటీవల జీజీహెచ్ పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో సూపరింటెండెంట్ ఈ తనిఖీ చేపట్టారు.
తన తనిఖీలలో ఆసుపత్రిలో కొన్ని సమస్యలను ఆయన గుర్తించారు. వాటిని వెంటనే పరిష్కరిస్తానని చెప్పారు. కాగా ఆయన ఈ తనిఖీలో భాగంగా ఎమర్జెన్సీ విభాగం, లేబరేటరి, సిటీస్కాన్, ఎంసీయూ, ఐసీయు వార్డులను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.