గన్నవరం వైసిపి అభ్యర్థి దుట్టా సీతా రామలక్ష్మి ?
posted on Jan 31, 2024 @ 12:39PM
గన్నవరం టిడిపి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వల్లభనేని వంశీకి ఈ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవచ్చని జోరుగా ప్రచారం సాగుతుంది. మరో వైపు వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులైన డాక్టర్ దుట్టా రాంచందర్ రావు కూతురు సీతా రామలక్ష్మికి టికెట్ ఇవ్వొచ్చని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత దుట్టా రాంచందర్ రావ్ ఆయన తనయుడైన వైఎస్ జగన్ కు దగ్గరయ్యారు. కానీ ఇటీవలి కాలంలో దుట్టా రాంచందర్ రావు వైసీపీపై అలక వహించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎపి కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దుట్టాను మర్యాదపూర్వకంగా కలిసి కాంగ్రెస్ లో చేరాలని కోరారు. దీనికి దుట్టా కూడ అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. గన్నవరం ప్రస్తుత ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై నెగెటివ్ సర్వే రావడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దుట్టా సీతమహలక్ష్మి కి టికెట్ ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఈమె పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. సీతా రామలక్ష్మి తన తండ్రి మాదిరిగా డాక్టర్ వృత్తిలో ఉన్నారు. దుట్టా రాంచందర్ ఒక వేళ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయన కూతురునే పోటీ చేయించాలని జగన్ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. దుట్టా రాంచందర్ గతంలో రెండు పర్యాయాలు గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనను ఎదుర్కోవడానికి వైసీపీ వేసిన గాలమని పరిశీలకులు భావిస్తున్నారు. దుత్తా వారసురాలికి టికెట్ ఇచ్చి గన్నవరం స్థానాన్ని కైవసం చేసుకోవాలని జగన్ భావిస్తున్నారు.