ఆడవాళ్లపై ఆగని ఆకృత్యాలు...
posted on Mar 9, 2015 @ 4:16PM
ఆడవాళ్లపై మగవాళ్ల ఆకృత్యాలకు అంతులేకుండా పోయింది. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎన్ని యాప్స్ తీసుకొచ్చినా వారిపై జరిగే అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజేనే ఓ యువతిపై జరిగిన సామూహిక ఆత్యాచారం మగవాళ్ల కండకావారానికి తార్కాణం. పంజాబ్ లోని లూధియానాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ 23 ఏళ్ల యువతిని ఇద్దరు యువకులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. పోలీసు కమిషనర్ ప్రమోద్ బాన్ తెలిపిన వివరాల ప్రకారం రాజ్ గురు నగర్ ప్రాంతంలో నివసిస్తున్న యువతి స్నేహితురాలిని కలుసుకొని ఆదివారం రాత్రి తన నివాసానికి తిరిగి వస్తుండగా నిందితులు ఓ కారులో వేగంగా వచ్చి ఆమెను కారులో ఎక్కించుకున్నారు. కారులో డ్రైవర్ తో పాటు ఇద్దరు యువకులు ఉన్నారు. ఆ తర్వాత నడుస్తున్న కారులోనే ఆమెపై ఆ ఇద్దరు యువకులు పలుసార్లు అత్యాచారం జరిపారు. తరువాత ఆమెను అదే ప్రాంతంలో దింపి పారిపోయారు. బాధితురాలు వెంటనే సమీపంలోవున్న పోలీసు స్టేషన్‌కు వెళ్లి సంఘటన గురించి ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. ఆమెపై అత్యాచారం జరిగినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నామని కమిషనర్ తెలిపారు.