అమ్మా గజ్జలా.. ఇక దయచెయ్!
posted on Oct 3, 2024 @ 3:24PM
సాధారణంగా ప్రభుత్వం మారితే, పాత ప్రభుత్వం ద్వారా పదవులు పొందినవారు రాజీనామా చేస్తూ వుంటారు. అది మర్యాద. కానీ కొంతమంది మర్యాదని కోరుకోరు. పదవిలోంచి ఊడబెరికే వరకూ ఆ కుర్చీనే పట్టుకుని వేలాడతారు. అలాంటివారే ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి. ఈమె కరడుగట్టిన వైసీపీ నాయకురాలు. నోరు తెరిచారంటే ఎదుటివారి చెవుల్లోంచి రక్తం కారడం ఖాయం. ఈ అర్హత వున్నందువల్లే ఆమెకు ఈ పదవి దక్కింది. ఈ పదవిలో ఉన్నంతకాలం ఆమెకు రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో ఎంతమాత్రం స్పందించలేదు. జగన్ ప్రభుత్వం సర్దుకున్న తర్వాత న్యాయంగా అయితే విజయక్ష్మి తన పదవికి రాజీనామా చేయాలి. కానీ ఆమె ఆ పని చేయకుండా.. నాది రాజ్యాంగబద్ధమైన పదవి. నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని భీష్మించుకుని కూర్చున్నారు. ముంబై హీరోయిన్ జెత్వానీ విషయంలో రాష్ట్ర పోలీసు యంత్రాంతం మొత్తం చురుగ్గా పనిచేస్తుంటే, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా విజయలక్ష్మి చాలా విచిత్రంగా స్పందించారు. జెత్వానీ కేసును పరిశీలించాల్సిన అవసరం మహిళా కమిషన్‌కి లేదని స్పష్టంగా చెప్పారు. ఆమె ముంబైకి చెందిన యువతి కాబట్టి తమకు ఎలాంటి సంబంధం లేదని ఆమె చెప్పారు. జెత్వానీ కేసు వైసీపీ నాయకులకు, జగన్‌కి చుట్టుకుంటోంది కాబట్టి విజయలక్ష్మి ఇలా స్పందించి వుంటారు. పాలనను గాడిలో పెట్టే పనిలో వున్న చంద్రబాబు గజ్జల విజయలక్ష్మి గురించి సీరియస్‌గా పట్టించుకోలేదు. మొత్తానికి ఆయన పట్టించుకుని విజయలక్ష్మిని పదవిలోంచి తీసేశారు. అయితే విజయలక్ష్మి మాత్రం తగ్గేదేలే అన్నట్టు హైకోర్టును ఆశ్రయించారు. తనను పదవి నుంచి తొగిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. అయితే హైకోర్టు మాత్రం విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌ని కొట్టేసింది. దరిమిలా విజయలక్ష్మి పదవీకాలం ముగిసింది.