వర్షాకాలంలో ఫర్నిచర్ దెబ్బతినకూడదు అంటే.. ఇలా జాగ్రత్త పడండి..!
posted on Jun 30, 2025 @ 9:30AM
వర్షాకాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ తేమ కారణంగా, ఇంటి ఫర్నిచర్ దెబ్బతింటుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో చెక్క ఫర్నిచర్ త్వరగా దెబ్బతినడం ప్రారంభమవుతుంది. తేమ కారణంగా చెక్క ఫర్నిచర్ రంగు మసకబారడం లేదా చెదపురుగుల దాడి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో వర్షాకాలంలో కొన్ని సులభమైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.
కొన్ని సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా విలువైన ఫర్నిచర్‌ను సురక్షితంగా ఉంచుకోవచ్చు. సకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే, వర్షం వచ్చిన కొన్ని వారాలలోనే ఫర్నిచర్ దాని మెరుపును కోల్పోయే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో తేమ, చెదపురుగులు నుండి ఫర్నిచర్‌ను రక్షించుకోవడానికి కొన్ని సులభమైన, ప్రభావవంతమైన చిట్కాలేంటో తెలుసుకుంటే..
స్థల మార్పిడి.
వర్షాకాలంలో చెక్క ఫర్నిచర్‌ను కిటికీలు, బాల్కనీ లేదా బాత్రూమ్ తలుపుల దగ్గర ఉంచకూడదు. వర్షపు నీరు లేదా తేమతో కూడిన గాలులు ఈ ప్రదేశాలకు సులభంగా చేరుతాయి. దీనివల్ల ఫర్నిచర్ దెబ్బతింటుంది. వర్షాకాలంలో కిటికీలను మూసి ఉంచాలి. మందపాటి కర్టెన్లను ఏర్పాటు చేసుకోవచ్చు. కిటికీలు, తలుపుల దగ్గర చెక్క ఫర్నిచర్ ఉన్నట్టైతే వాటి స్థలాన్ని మార్చడం మంచిది.
నాప్తలీన్ బాల్..
నాఫ్తలీన్ బంతులు దుస్తులను సురక్షితంగా ఉంచడమే కాకుండా, ఫర్నిచర్‌ను చెదపురుగుల నుండి రక్షిస్తాయి. అల్మారా, డ్రాయర్లు, ఇతర ఫర్నిచర్ లోపల నాఫ్తలీన్ బంతులను ఉంచవచ్చు. ఇది తేమను నిరోధించడంలో సహాయపడుతుంది. దీని వల్ల ఫర్నిచర్ కొత్తగా ఉంటుంది.
కాలానుగుణంగా పాలిష్
చెక్క ఫర్నిచర్ కు ప్రత్యేక శ్రద్ధ అవసరం. వాటిని ఎప్పటికప్పుడు పాలిష్ చేయడం అవసరం. దీనివల్ల ఫర్నిచర్ చాలా కాలం పాటు కొత్తగా కనిపిస్తుంది. అదే సమయంలో వర్షాకాలంలో తేమ, చెదపురుగుల నుండి కూడా దీనిని రక్షించవచ్చు.
వేప ఆకులు..
ఎండిన వేప ఆకులను అల్మారా లేదా చెక్క క్యాబినెట్‌లో ఉంచవచ్చు . ఈ ఆకులు తేమను గ్రహించడంలో సహాయపడతాయి. దీనితో పాటు, వాటిని ఫంగస్, కీటకాల నుండి కూడా రక్షించవచ్చు. కావాలంటే దానిలో కొన్ని కర్పూరం ముక్కలను కూడా వేయవచ్చు. ఇది దుర్వాసన రాకుండా చేస్తుంది.
చెదపురుగుల స్ప్రే ..
ఫర్నిచర్ పై యాంటీ-టెర్మైట్ స్ప్రేను కూడా పిచికారీ చేయవచ్చు. ఇది చెదపురుగుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే ఫర్నిచర్ సురక్షితంగా ఉంటుంది. చెదపురుగులు ఎక్కువగా ఉండే ప్రదేశంలో దీన్ని ఉపయోగించడం మంచిది.
*రూపశ్రీ.