నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్
posted on May 21, 2024 @ 11:04AM
ఉగ్రవాదం అంటే మనం సాధారణం గా తాలిబన్ ఉగ్రవాదులు ని అనుకుంటూ ఉంటాము,కానీ ప్రపంచం లో అంతకంటే భయంకరమైన ఉగ్రవాదం ఇంకొకటి వుంది , అది ఆర్ధిక ఉగ్రవాదం - ప్రపంచం అంత తాను నమ్మిన సిధ్ధాంతాన్ని మాత్రమే నమ్మాలి , అలా నమ్మకపోతే అందరినీ చంపేయాలి అంటే చంపేసి అయినా సరే తన వాదనే నెగ్గాలి అని భావించి దాన్ని కార్యాచరణ లో పెట్టడం ఉగ్రవాదం ప్రధాన ఎజెండా. అందులో లాజిక్ ఏమీ ఉండదు , ఈ నేపథ్యంలో పిల్లి మెడలో గంట కట్టేవారు ఎవరు అనే ప్రశ్నకు గుజరాత్ లోని అహ్మదాబాద్ పోలీసులు సమాధానం వెతికారు.
పోలీస్ శాఖకు చెందిన ఉగ్రవాద నిరోధక బృందం నలుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంది. నిందితులను ముహమ్మద్ నుస్రత్, ముహమ్మద్ నఫ్రాన్, ముహమ్మద్ ఫారిస్, ముహమ్మద్ రస్దీన్‌గా గుర్తించారు. శ్రీలంక జాతీయులైన నిందితులు కొలొంబో నుంచి చెన్నై మీదుగా అహ్మదాబాద్‌కు చేరుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌లో ఆత్మాహుతి దాడులు చేసేందుకు వీరు వచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పాక్‌లోని ఐసిస్ ఉగ్రవాది అబుతో నిందితులు నిరంతరం టచ్‌లో ఉన్నట్టు కూడా తెలుసుకున్నారు. భారత్‌లోని యూదు, హిందూ దేవాలయాలతో పాటు కొందరు బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ ప్రముఖులే టార్గెట్‌గా ఆత్మాహుతి దాడులు చేయాలనేది వీరి ప్లాన్ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. పట్టుబడ్డ ఉగ్రవాదుల్లో ఒకరికి పాక్ వీసా కూడా ఉందని, అతడు అక్కడ తన హ్యాండ్లర్‌ను కలుసుకోవాల్సి ఉందని సమచారం. భారత్‌లో కొందరితో ఉగ్రవాదులు సంప్రదింపులు జరిపి ఉంటారని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.