కరోనా రోగిపై.. నలుగురు డాక్టర్స్..
posted on Jun 10, 2021 @ 3:31PM
డాక్టర్ ప్రాణం పొయ్యాలి.. ప్రాణాన్ని నిలబెట్టాలి..సంఘసేవ చెయ్యాలి.. సమాజంలో ఆదర్శనంగా ఉండాలి.. ధనిక పేద తేడా లేకుండా వైద్యం అందించాలి.. ఎందుకంటే తెల్ల కోట్ వేసుకునే వాళ్లకు మాత్రమే కలిపించింది.. ఈ సమాజం.. ఎందుకంటే డాక్టర్ వృత్తి చాలా పవిత్రమైనది.. కొంత మంది డాక్టర్స్ ని చూస్తే కాలుమొక్కలనిపిస్తుంది.. ఇంకొంత మంది డాక్టర్స్ ని చూస్తే అదే కాలుపట్టి కిందికి గుంజాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ తెల్ల కోట్ వృత్తి చాలా స్వేచ్ఛమైనది.. కానీ కొంత మంది డాక్టర్స్ ఈ పవిత్రమైన వృత్తిని అపవిత్రం చేస్తున్నారు.. కొందరు ప్రజల ప్రాణాలతో అడ్డుకుంటే.. మరికొందరు ప్రజల ప్రాణాలు నిలబెడుతున్నారు.. ఇంకొందరు అదే పేషంట్ల తో తమ కామ వాంఛ తీర్చుకుంటున్నారు..
మనకు కనిపెంచే వాళ్ళు అమ్మానాన్నలు ప్రధమ దేవులు అయితే.. అమ్మనాన్నలు ఇచ్చిన జన్మను ఒక గాడిలో పెట్టేది అనిపించని ఆ దేవుడు.. ఆ దేవుడి తర్వాత దేవుడిలా కొలిచేది డాక్టర్ నే. ఎందుకంటే చావుబతుకులతో ఉన్న వాళ్లకు పునర్జన్మ ఇవ్వగలిగిన వాడు ఒక డాక్టర్ మాత్రమే.. ఈ విషయం అందరికి తెలుసు.. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకుని తీరాల్సిందే.. ఈ కరోనా సమయంలో వారే ప్రజలకు దేవుళ్లు. కానీ అలాంటి వైద్యులే కామంతో కళ్ళుమూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. కనికరం లేకుండా కనీసం విజ్ఞతలేకుండా ప్రవర్తించాడు. వైద్యం కోసం వచ్చిన మహిళా రోగులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా వైద్యం కోసం వచ్చిన ఓ కరోనా రోగిని ఒక్కరు కాదు ఇద్దరు కాదు నలుగురు వైద్యులు దారుణంగా అత్యాచారం చేసి ఆమె మరణానికి కారణమయ్యారు. కరోనాతో బాధపడుతున్నదన్న కనికరం కూడా లేకుండా యువతిపై లైంగిక వాంఛ తీర్చుకున్నారు.
పూర్తి వివరాలలోకి వెళితే..
20 ఏళ్ల యువతి చికిత్స నిమిత్తం ప్రయాగ్ రాజ్‌లోని స్వరూప్ రాణి నెహ్రు ఆసుపత్రి లో చేరింది. అక్కడ ఓ నలుగురు డాక్టర్లు ఆమెను చికిత్స పేరుతో తాకుతూ లైంగిక వేధింపులకు గురిచేశారు. దీంతో ఆమె వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిపై వ్యూహాన్ని తిప్పికోట్టింది.. అయినా వాళ్ళు పట్టించుకోలేదు.. పట్టించుకోని ఆ డాక్టర్లు జూన్ 2 అర్ధరాత్రి ప్లాన్ వేశారు. , వాళ్ళ పథకం ప్రకారం ఆమెపై అత్యచారం చేసి వారి లైంగిక వాంఛ తీర్చుకున్నారు. ఆ తర్వాత ఆమె చనిపోయింది. ఇక ఏ ఈ విషయాన్ని బాధితురాలు ఆమె సోదరుడికి చెప్పగా జూన్ 3న బాధితురాలి సోదరుడు ఫిర్యాదు ఇవ్వగా… యువతి చనిపోయిన తర్వాత ప్రయాగ్‌రాజ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ విషయంలో ప్రాథమిక విచారణ జరిపినందున ఎఫ్‌ఐఆర్‌కు దాఖలు చేయడంలో ఆలస్యం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇక మరో పక్క తమ ఆసుపత్రిలో ఇలాంటి ఘటన జరిగినట్టు ఆనవాళ్లు లేవని, ఆ నలుగురు డాక్టర్లు ఎవరో కూడా తెలియదని ఆసుపత్రి యాజమాన్యం తెలపడం గమనార్హం. ఇక ఈ ఘటనపై విచారణ ముమ్మురం చేయాలనీ పోలీస్ ఉన్నతాధికారులు పోలీసులకు ఆదేశించారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో ఆలస్యంగా వెలుగుచూసింది.