ఢిల్లీలో కాల్పులు – హై అలర్ట్
posted on Nov 15, 2012 @ 4:34PM
దేశ రాజధానిలో పార్లమెంట్ కి దగ్గర్లో ఉన్న గురుద్వారా వద్ద కాల్పులు జరిగాయ్. గురుద్వారా ప్రబంధక్ కమిటీ సమావేశంలో చెలరేగిన ఘర్షణ కాల్పులకు దారితీసింది. ఓ వర్గం తల్వార్ లతో దాడికి దిగడంతో రెచ్చిపోయిన మరో వర్గం కాల్పులు జరిపింది.
పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాల్నీ చెదరగొట్టేవరకూ గురుద్వారా దగ్గర ఉద్రిక్త పరిస్థితి తప్పలేదు. ఇరువర్గాల దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పార్లమెంట్ కి కూతవేటు దూరంలో ఇలాంటి ఘటన జరగడం కలకలం రేపింది. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు గురుద్వారా దగ్గర భారీ ఎత్తున బలగాల్ని మోహరించారు.