వైసీపీ ఎంపీలకు.... నిర్మల సీతారామన్ షాక్
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను ఆపాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను కలిసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఎంపీలకు ఊహించని ప్రశ్న ఎదురైంది. ప్రైవేటీకరణ కాదని, పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్) విధానంలో మాత్రమే చేస్తున్నారని నిర్మల సీతారామన్ ప్రశ్నించడంతో ఎంపీలు నిస్సత్తువకు లోనయ్యారు.
పీపీపీ అంటే ప్రైవేట్ కాదు: నిర్మల సీతారామన్
వైద్య కళాశాలల అంశాన్ని ప్రస్తావించినప్పుడు, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, "మేము మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం లేదు. మీరు అంటున్నట్టుగా అవి కేవలం పీపీపీ విధానంలో మాత్రమే కదా జరుగుతున్నాయి?" అని సూటిగా అడిగారు. దీనికి సమాధానంగా, వైసీపీ ఎంపీలలో ఒకరైన, జగన్ బాబాయి సుబ్బారెడ్డి, "అవును, అవి పీపీపీ పద్ధతిలోనే ఉన్నాయి" అని ధృవీకరించారు. వెంటనే నిర్మల సీతారామన్, "మరి అలాంటప్పుడు మీరు ప్రజల్లోకి వాటిని 'ప్రైవేట్' అని ఎందుకు చెబుతున్నారు?" అని ప్రశ్నించారు.
ఎంపీలు ఏదో చెప్పబోతుండగా, "పీపీపీ అంటే ప్రైవేట్ కూడా ఉంటుంది కదా మేడం..." అని అన్న సమయంలోనే నిర్మల సీతారామన్ కలుగజేసుకున్నారు. "నో, నో. మీరు నన్ను దయచేసి తప్పుదోవ పట్టించవద్దు. మీరు ప్రజలను తప్పుదోవ పట్టినట్లుగా నన్ను కూడా చేస్తే ఎలా?" అని ఆమె గట్టిగా ప్రశ్నించారు.. నిర్మల సీతారామన్ నుండి వచ్చిన ఈ అనూహ్య ప్రతిస్పందనతో, వైసీపీ ఎంపీలు మరింత మాట్లాడలేక తెల్లమొహం వేసుకుని వెనుతిరిగారు.