కరోనా పై అమెరికా ఎఫ్ డీఏ అలా.. హెల్త్ సెక్రటరీ ఇలా...
posted on Jun 16, 2020 @ 12:31PM
కరోనా తాకిడికి ప్రపంచం మొత్తం విలవిలాడుతోంది. ఈ సమయం లో అమెరికా భారత్ నుండి హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లను పెద్ద మొత్తం లో ఇంపోర్ట్ చేసుకుంది. ఐతే ఈ మందుల వాడకం పై అమెరికా లోనే భిన్న వాదనలు ఉన్నాయి. తాజాగా అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్ డి ఏ) ఈ మందులను ప్రిస్క్రైబ్ చేయొద్దంటూ ఆదేశాలు ఇచ్చింది. ఐతే ట్విస్ట్ ఏంటంటే మలేరియా మందులు కరోనా ట్రీట్ మెంట్ లో ఉపయోగించ వద్దని ఎఫ్ డి ఏ ఆదేశాలు ఇచ్చిన కొద్ది గంటల్లోనే అమెరికా హెల్త్ సెక్రెటరీ అలెక్స్ అజర్ ఆ మందులను డాక్టర్లు భేషుగ్గా కరోనా బాధితులకు సూచించవచ్చని తేల్చి చెప్పారు. ఐతే తాజా ఎఫ్ డి ఏ నిర్ణయం తో హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను రోగులు వైద్యుల పర్యవేక్షణ లోనే వాడాలని భావించే అవకాశం ఉన్నందున తాను క్లారిటీ ఇస్తున్నట్లు అయన తెలిపారు.
ఎఫ్ డి ఏ తాజా నిర్ణయం పై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తన అసంతృప్తి వ్యక్తం చేసారు. కరోనా పై పోరాటంలో హెచ్ సి క్యూ సమర్ధంగా పని చేస్తోందని ఇతర దేశాలు నివేదికలు ఇస్తుంటే ఒక్క అమెరికా ఏజన్సీలు మాత్రమే దానిని గుర్తించలేక పోతున్నాయని ఆయన అన్నారు.