పిల్లాడి మార్కులు 6.. తండ్రి కొట్టినవి...!
posted on Jul 2, 2022 @ 5:27PM
ఒకరోజు చైనా ఝాన్‌ఝూలో ఓ పిల్లాడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడని అడగడానికి దగ్గరికి వెళితే భయపడ్డాడు, కారణం మళ్లీ వాళ్ల నాన్న క్రరెత్తేడే మోనని! చూస్తే వాడి వీపు మీద ఎర్రటి చారలు తేలి వున్నాయి. వాడేమీ టెన్త్ విద్యార్ధీ కాదు. బహుశా 8వ తరగతి విద్యార్ధి అయి వుంటాడు. వాళ్ల నాన్న హసన్ వాడిని చచ్చేట్టు కొట్టడానికి కారణమేమంటే వాడికి లెక్కల్లో వందకి ఆరు మార్కులు వచ్చాయని!
మామూలుగానే లెక్కలంటే ఆ తరగతుల్లో వారికి నూటికి 90 శాతం మంది భయమే వుంటుంది. కారణం టీచర్ల భయం, కూడికలు, తీసివేతల్లో కన్‌ఫ్యూజన్! ఏమైప్పటికీ హసన్ కొడుకు మాత్రం మిగతా సబ్జెక్టుల్లో బాగానే వున్నప్పటికీ లెక్కల్లో దారుణంగా వుండడానికి కారణం హసన్ సరిగా కనుక్కోలేదు. స్కూలుకి వెళ్ల లేదు. పిల్లడికి మంచి మార్కలు వచ్చితీరాలన్న పట్టుదల తప్ప. అందుకు వాడికి ఏకంగా ట్యూషన్ టీచర్‌ని పెట్టాడు. కానీ అంకెలు వాడికి ఏమాత్రం మనసుకి ఎక్కలేదు. తండ్రి, ట్యూషన్ టీచర్ వేగంగా ఏదో చెప్పడం తప్ప వాడికి అర్ధమయ్యేలా చెప్పలేకపోయారు. టీచర్ అంత అవకాశమీయదు. క్లాసులో వాడిని ఒక్కడినే పట్టించుకునే తీరిక వుండదు. అన్నీ వెరసి వాడి వీపు విమానం మోత మోగిచాయంటే నమ్మండి!
అక్షరాల కంటే అంకెలంటే ఇలానే భయం ఏర్పడి పెద్దయ్యాక కూడా కాస్తంత ఇబ్బంది పెడుతూనే వుం టాయి. ఏమైనా దానికో స్పెషల్ టాలెంట్ వుండాల్రా అబ్బాయ్ అనే టీచర్లు వుంటారు. లెక్కల్లో రాణించ డం అంత సులువు కాదు. వస్తే వాడు సూపర్ మ్యాన్. రాకుంటూ ఎవరికి వారే! మిగతా సబ్జెక్టుల కంటే మాథ్స్ చెప్పడంలో ప్రత్యేక నైపుణ్యం వుండాలి. ఈ సబ్జెక్టు చెప్పేవారు చాలా ప్రశాంతంగా వుండాలి, చెప్పాలి. అపుడే విద్యార్ధులు ఇట్టే అర్ధంచేసుకుంటారు. కాకపోయినా టీచర్ దగ్గరికి వెళ్లి డౌట్స్ క్లియర్ చేసుకోగల్గుతారు. అలాగాకండా, కుర్చీ పక్కనే బెత్తం గదలా ఆనించి పెట్టుకుంటే విద్యార్ధులకు అంకెలు అర్ధం కావు, బుర్రలోకి ఏదీ ఎక్కదు, వొణుకు భయం వాడి ప్రాణాల్ని తోడేస్తుంటాయి. హసన్ కొడుకు పరిస్థితీ అదే. అందుకే వాడికి మాథ్స్‌లో వందకి ఆరు మార్కులే వచ్చాయి.
ఇది చిత్రమో విచిత్రమో అనుకోవద్దు. చాలా చాలమంది బాల్యంలో అనుభవైక‌్కమె. పెద్దయ్యాక 8, 9, 10 తరగతుల్లో ఆ టీచర్ను దాటి ఎలా రాగలిగానా అని ఆలోచిస్తే నిజంగానే ఆశ్చర్యంగానే వుంటుంది.
కొసమెరుపేమంటే.. హనన్ కు తన కొడుకును కొట్టినందుకు పశ్చాత్తాపం లేదు. వాడికి ట్యూషన్ పెట్టించ డం, వెంట వుండి చదివించడంలో ఎంతో నష్టపోయానని బాధపడుతున్నాడట!