కూతురికి ప్రియురాలి పేరు..భార్య ఇంట్లో ఫైట్..
posted on Jul 15, 2021 @ 11:29AM
పిల్లలు పేర్లు పెట్టడం ఎప్పుడు ఉన్న రోజుల్లో మామూలు విషయం కాదనే చెప్పాలి. తల్లి దండ్రులకు పెద్ద తలనొప్పి అనే చెప్పాలి..వాళ్ళ ఇంటి తరపు వాళ్ళ పేర్లు పెట్టాలని భార్య.. లేదు మా ఇంటి తరపు వాళ్ళ పేర్లు పెట్టాలని భార్య.. ఇది ఒక్కడు.. ఇప్పుడు వ్యక్తి గత స్వేచ్ఛ ఎక్కువైడి కాబట్టి ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికి భార్య తరపు వాళ్ళ పేరు. మరొకరికి భర్త తరపు వాళ్ళ పేరు పెట్టుకుంటున్నారు.. ఇప్పటికే ఈ రెండో అంతరించిపోయాయి.. పూర్వీకులను గుర్తుచేసుకోవడం లేదు నేటి తరం యువత..అయితే తాజాగా కుమార్తెకు పెట్టిన పేరు వల్ల రచ్చ అయింది.. అదేంటో మీరు తెలుసుకోండి..
తల్లిదండ్రులు తమ బిడ్డకు పేరు పెట్టడానికి ముందు చాలా ఆలోచిస్తారు. పంతుల్ని అడుగుతారు. పేరు బలం చూస్తారు. కొంతమంది మంచి అర్ధాన్నిచ్చే పేర్ల కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతారు. కానీ తాజాగా ఒక వ్యక్తి తన కుమార్తెకు ప్రేయసి పేరు పెట్టాడు.. పాపం భార్యకు తెలీదు.. ఒకరోజు ఏం జరిగిందంటే..? మరికొందరు తమ తాతముత్తాతల లేదా దేవుళ్ల పేర్లు వచ్చేలా పెట్టుకుంటారు. చాలా మంది తమ పిల్లలకు తమ అభిమానించే రాజకీయ నాయకుల, హీరోల, సంఘసంస్కర్తల పేర్లు పెడతారు. ఇంకొంతమంది అయితే కాస్త ముందుచూపుతో ఆలోచించి.. ఫ్యూచర్‌లో తమ పిల్లలకు పేరు వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా కాస్త ట్రెండీగా క్యాచీగా నేమ్స్ సెలక్ట్ చేసుకుంటారు. అయితే, తన తప్పు తెలియకుండా ఉండటానికి ఒక వ్యక్తి తన కుమార్తెకు పేరు పెట్టాడు. అవును, తన ప్రేయసి వ్యవహారం గురించి ఎవరికీ తెలియకూడదనే ఆలోచనతో అతను కూతురుకు పేరు పెట్టాడు.
అమెరికాలోని కెంటుకీలో ఒక వ్యక్తి తన కుమార్తెకు తను ప్రేమించిన ప్రేయసి పేరు పెట్టాడు.. మరిచిలేక పోయాడు అనుకుంటా... లేదంటే ముందే జాగ్రత్త పడడానికి అనుకుంటా మరి. తన అక్రమ సంబంధాన్ని గుట్టు ఇంట్లో తెలియనివ్వకూడదని అతను అనుకున్నాడు. అయినప్పటికీ, అతను ప్లాన్ చేసినట్లు జరగలేదు. బిడ్డ పుట్టిన కొద్ది నెలలకే అసలు రహస్యం బయటపడింది. ఆడవాళ్ళ కళ్ళు కప్పి మగవాళ్లు ఏమైనా చేయగలరా చెప్పండి.. అద మగవాళ్ల మూర్ఖత్వం కాకపోతే దీని తరువాత అతడి ఇంట్లో చాలా గందరగోళం చెలరేగింది. తన తండ్రి ఆమె ప్రియురాలు పేరు తనకు పెట్టారని తాజాగా ఓ యువతి టిక్ టాక్ వేదికగా వెల్లడించింది. ఆమె పుట్టకముందే, తల్లిదండ్రులు అబ్బాయి పుడితే తల్లి.. అమ్మాయి పుడితే తండ్రి పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారట. అమ్మాయి జన్మించడంతో, తండ్రి ఆమెకు క్రిస్టినా అని పేరు పెట్టారు. ఆమె తల్లి కూడా నేమ్ బానే ఉందని ఆనందపడింది. వాస్తవానికి కుమార్తెకు ఈ పేరు ఎందుకు ఎంచుకున్నారో తల్లికి తెలియదు. కొన్ని నెలల తరువాత తన తండ్రి మోసం చేస్తున్న విషయం తల్లికి తెలిసిపోయిందట. ఇంట్లో అనుకోకుండా ప్రేయసి పేరును ప్రస్తావిస్తే దొరికిపోకుండా ఉండేందుకు.. అతడు ఈ పని చేశాడట. దీంతో తమ ఇంట్లో అనేక గొడవలు జరిగాయని సదరు యువతి వివరించింది.