కూతుర్ని చంపిన తండ్రి.. అసలు కారణం ఇది..
posted on Mar 15, 2021 @ 11:30AM
పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికీ పెళ్ళై 12 సంవత్సరాలు అవుతుంది. 8 ఏళ్ళ కుమార్తె ఉంది. ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యత కోసం పొట్ట చేత పట్టుకుని దుబాయ్ వెళ్ళాడు గురువేంద్ర. దూర దేశం కదా.. సంవత్సరానికి చుట్టపు చూపుగా ఇంటికి వచ్చేవాడు. ఇంకేముందుడి భార్యకు భర్త కష్టం కనిపించలేదు. తన అవసరం మాత్రం కనిపించింది. అందుకోసం బతుకుదామనుకుంది. అందుకే ఆ అవసరం తన తప్పుకు కారణం అయింది. ఆ అవసరం వేరే వ్యక్తి తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. చివరికి ఆ వ్యవహారం భర్త పిల్లలను వదిలి ప్రియుడితోనే వెళ్తానని స్థాయికి చేరింది. అమ్మ నాన్న ఎంత చూపిన తన ప్రియుడితోనే వెళ్తానంటూ భీష్మించు కూర్చుంది. ఆ కారణం చేతనే కుటుంబంలో గొడవలు జరుగుతుండడంతో పరువు పోతుందన్న ఉద్దేశంతో తండ్రే కుమార్తెను హత్య చేశాడు. కడప జిల్లా వేంపల్లెలో ఈ సంఘటన జరిగింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ మధుసూదనరెడ్డి తెలిపిన వివరాల మేరకు వేంపల్లెకు చెందిన గురువేంద్రకు, ప్రొద్దుటూరుకు చెందిన పోరుమామిళ్ల వనజరాణి (29)తో 2009లో వివాహమైంది. వీరికి 8 సంవత్సరాల పూజిత అనే కుమార్తె ఉంది. భర్త గురువేంద్ర దుబాయ్‌లో పనిచేస్తూ ఏడాదికో రెండు నెలలు ఇంటికి వచ్చి వెళ్లేవారు. రెండు నెలల క్రితం గురువేంద్ర దుబాయ్‌లో పనిమానుకుని వేంపల్లెకు వచ్చాడు. ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకొని ఉపాధి కోసం ప్రయత్నించేవాడు. ఈ నేపథ్యంలో భార్య వనజరాణికి ప్రొద్దుటూరులో ప్రియుడు ఉండేవాడు. అతడితో తరచూ మాట్లాడేది. ఇటీవల ఈ విషయంపై ఆ కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. పెద్దల వద్ద పంచాయితీ కూడా జరిగింది. భర్త, కుటుంబ సభ్యులు వద్దు ప్రియుడి వద్దకే వెళ్తానని తెగేసి చెప్పడంతో ఆమె తండ్రి రాజశేఖర్ ఇతర కుటుంబ సభ్యులు ఆమెకు నచ్చచెప్పినప్పటికీ వినలేదు.
వేంపల్లెలోని ఇంటిలో మేడపైకి వనజరాణిని తండ్రి రాజశేఖర్ మరో ఇద్దరు కలిసి మాట్లాడేందుకు పిలుచుకెళ్లారు. ఎంతకీ వినకపోవడంతో చున్నీతో గొంతుకు ఉరివేసి హత్య చేసి పరారయ్యారు. ఆదివారం విషయం బయటకు తెలియడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గురువేంద్ర ఫిర్యాదు మేరకు వనజరాణి తండ్రి రాజశేఖర్ మరో ఇద్దరిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు, ఎస్‌ఐలు ఆదివారం సాయంత్రం వనజరాణిని హత్య చేసిన ఇంటి స్థలాన్ని పరిశీలించారు. భర్త, అత్త ఇతర కుటుంబ సభ్యులను విచారించారు.