కూతురితో అల్లుడి ప్రేమ డ్రామా.. అల్లుడిని చంపిన మామ..
posted on Jun 7, 2021 @ 9:34AM
ఈ రోజుల్లో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపడం అంటే.. ఏదో టీ స్టాల్ కి వెళ్లి టీ తాగినంత ఈజీ అయిపొయింది. ఒక వైపు కరోనా ఎవరి ప్రమేయం లేకుండా మనుషులను త్రిమింగళం మింగినట్లు మింగుతుంది.. మరో వైపు ఇంట్లో అమ్మ నాన్నలు తిట్టారని, లవర్ వదిలి పెట్టి పోయిందని.. పెళ్ళాం మోసం చేసిందని.. అల్లుడు విసిగిస్తున్నాడని.. చంపుకునే వార్తలు నిత్యం వింటున్నాం..మనం ఇప్పుడు మీరు చదివే వార్త కూడా అలాంటిదే.. మరింకెందుకు ఆలస్యం ముందుకు వెళ్ళండి..
ఓపెన్ చేస్తే.. అది హైదరాబాద్. ఫలక్‌నుమా ఫరూక్ అనే వ్యక్తిని పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు. ఇటీవలే జైలు నుంచి విడుదలైన ఫారుక్ మరోసారి బాలికను కలిశాడు. ఇంట్లోవారికి చెప్పకుండా ఆమెను తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. దాదాపు వారి పెళ్లి అయి రెండు ఏళ్ళు అవుతుంది. కూతుర్ని ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడిని తండ్రి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఫలక్‌నుమా అన్సారీ రోడ్డుకు చెందిన అబ్దుల్ షారూక్ (24) మైలార్‌దేవ్‌పల్లికి చెందిన అన్వర్ కుమార్తెను 2020 మే నెలలో ప్రేమ పేరుతో వేధించడంతో నిర్భయ చట్టం కింద కేసు నమోదయ్యింది.
ఇటీవలే జైలు నుంచి విడుదలైన ఫారుక్ అత్తగారింటికి ఫోన్ చేస్తూ....తన భార్యను పంపించాలంటూ షారూఖ్ తరచుగా ఫోన్ చేయసాగాడు. షారూఖ్‌కు గతంలోనే పెళ్లి జరగడంతో పాటు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. దీంతో ఆ విషయం తెలుసుకున్న అన్వర్ అల్లుడిని హత్య చేయించాలని ప్లాన్ చేశారు. ఆదివారం ఉదయం షారూక్‌కు ఫోన్ చేసి శాలిబండ వరకు వెళ్దామని పిలిపించాడు. మామ అల్లుడి మట్టి కరిపించడానికి సిద్ధం అయ్యాడు.. అది మిట్ట మధ్యాహ్నం. 12.30 గంటల సమయంలో యాక్టివాను అల్లుడు నడుపుతున్నాడు..మామ అన్వర్ వెనుక కూర్చున్నాడు. ఇద్దరు వెళ్తున్నారు. ఫలక్‌నుమా డిపో ఎదురుగా రాగానే ఒక్కసారిగా తన వద్ద ఉన్న చాకుతో అన్వర్, షారూఖ్ గొంతు కోశాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.