Read more!

ఎర్రబెల్లి ఏం చేస్తారో?

 

 

 

తెలంగాణా తెలుగుదేశం పార్టీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు రాజకీయ పయనంపై కొనసాగుతున్న చర్చకు ఒకటిరెండు రోజుల్లో తెరపడే అవకాశం కనపిస్తోంది. మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎర్రబెల్లి ఆ పార్టీని వీడుతారా... అందులోనే కొనసాగుతారా అనే అంశంపై శనివారం స్పష్టత వస్తుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణా కమిటీ ఏర్పాటు చేసి తనకు అధ్యక్ష పదవి ఇవ్వాలని ఎర్రబెల్లి డిమాండ్ చేస్తున్నారు. కమిటీ ఏర్పాటు ఉంటుందా లేదా అనే విషయం శనివారం తేలుతుందని ఎర్రబెల్లి అనుచరులు చెబుతున్నారు.

 

కానీ, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జీ దుగ్యాల శ్రీనివాసరావు, ఎర్రబెల్లిని పార్టీలోకి తీసుకోవద్దంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 11న హన్మకొండలో కాంగ్రెస్ శ్రేణులతో సమావేశం పెట్టి మరీ దయాకర్‌ రావును కాంగ్రెస్‌ లోకి రానివ్వబోమని ప్రకటించారు. శుక్రవారం ఏకంగా నియోజకర్గంలోని ముఖ్యనేతలతో కలిసి హైదరాబాద్‌ వెళ్లారు. ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జి దిగ్విజయ్‌ సింగ్‌ ను, టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను కలిసి.. దయాకర్‌ రావును పార్టీలోకి తీసుకోవద్దని కోరారు.