వ్యాధుల మూలాలను శోధించిన శాస్త్రవేత్త
posted on Aug 24, 2020 @ 2:46PM
సురక్షితమైన యాంటీ ఫంగల్ డ్రగ్ కనిపెట్టిన
ఎలిజబెత్ లీ హాజెన్ (ఆగష్టు 24, 1885- జూన్ 24, 1975)
చుట్టూ ఉండే పరిసరాలను గమనిస్తే ఎన్నోఅద్భుతాలు కనిపిస్తాయి. వాటిలో పాటు సమస్యలు గోచరిస్తాయి. ప్రకృతిపై మక్కువ పెంచుకున్న ఒక అమ్మాయి మైక్రోబయాలజీలో పరిశోధనలు చేసి మనషుల్లో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లకు సురక్షితమైన యాంటీ ఫంగల్ డ్రగ్ కనిపెట్టారు. ఆమే ఎలిజబెత్ లీ హాజెన్. ఆమె కనిపెట్టిన నిస్టాటిన్ (యాంటీ ఫంగల్ , యాంటీ బయాటిక్ డ్రగ్) ఇరవై దశాబ్దంలోనే అత్యద్భుతమైన , దివ్యౌషదంగా పేర్కోంటారు. అంతేకాదు బ్యాక్టీరియా నిర్ధారణలో ఆమె అనేక విజయాలు సాధించారు. ఆంత్రాక్స్ వ్యాప్తి, తులరేమియా (ప్లేగు లాంటి వ్యాధి) తదితర అరుదైన జబ్బుల మూలాలను గుర్తించగలిగారు. ఆమె కనిపెట్టిన నిస్టాటిన్ఫంగల్ ఇన్పెక్షన్లకు ఎంతో బాగా పనిచేసుంది. అంతేకాదు మొక్కల్లోనూ ఫంగల్ ఇన్సెక్షన్లు నివారిస్తుంది. పాతబడిన, శిథిలావస్థకు చేరిన కళాకృతులకు జీవం పోస్తుంది.
ఎలిజబెత్ లీ హాజెన్ 1885 ఆగస్టు 24 న మిస్సిస్సిప్పిలో 24 ఆగస్టు 1885లో ఎలిజబెత్ లీ హాజెన్ జన్మించారు. ఆమె తల్లిదండ్రులు మాగీ హార్ఫర్, ఎడ్గార్ హాజెన్. ముగ్గురు సంతానంలో ఆమె రెండో అమ్మాయి. ఆమె నాలుగేళ్ల వయసులో తల్లిదండ్రులు మరణించారు. దాంతో ముగ్గురు పిల్లలు వారి అత్తమామ వద్ద పెరిగారు.
చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండే ఎలిజబెత్
మిస్సిస్సిప్పి యూనివర్శిటీ ఫర్ ఉమెన్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పూర్తి చేశారు. తనకు ఇష్టమైన మైక్రోబయాలజీలో పరిశోధన కోసం కొలంబియాలోని జీవశాస్త్ర విభాగంలో చేరారు. 1917 లో కొలంబియా విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ ఆఫ్ బయాలజీని పూర్తి చేశారు. ఆ తర్వాత 1927 లో మైక్రోబయాలజీలో పిహెచ్.డి. పూర్తి చేసి డాక్టరెట్ అందుకున్న మొదటి మహిళ గా పేరు నమోదు చేసుకున్నారు. అంతేకాదు ఆమె మొదటి ప్రపంచ యుద్ధంలో ఆమె ఆర్మీ డయాగ్నొస్టిక్ లాబొరేటరీ టెక్నీషియన్‌గా పనిచేశారు. న్యూయార్క్ లోని పబ్లిక్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాబొరేటరీస్ , రీసెర్చ్ కార్యాలయంలో పనిచేశారు.
పరిశోధన వైపు ...
కొలంబియాలో చదువుతున్నప్పుడే జీవ రసాయన శాస్త్రవేత్త రేచల్ ఫుల్లర్ బ్రౌన్ తో హాజెన్ కు పరిచయం. వీరిద్దరూ కలిసి అనేక ప్రయోగాలు చేశారు. శీలంధ్ర వ్యాధులపై విస్తృతంగా పరిశోధనలు చేశారు. 1948లో వీరిద్ధరూ కలిసి స్ట్రెప్టోమైసెస్ నూర్సీబ్యాక్టిరియా నుంచి యాంటీ ఫంగల్ డ్రగ్ తయారు చేశారు. దానిని ఫంగైసిడిన్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఈ డ్రగ్ పేరును నిస్టాటిన్ గా మార్చి పేటెంట్ కూడా తీసుకున్నారు.
మొదటి ఏడాదే లక్షా 35వేల డాలర్లు
యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించే సురక్షితమైన మొదటి డ్రగ్ నిస్టాటిన్. 1950 చివరల్లో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సమావేశంలో డాక్టర్ ఎలిజబెత్, డాక్టర్ రేచల్ తమ పరిశోధన ఫలితాలను ప్రకటించారు. ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకు 1954లో ఇ.ఆర్. స్క్విబ్ అండ్ సన్స్ కంపెనీ ద్వరా ఈ డ్రగ్ మార్కట్ లో విడుదల చేశారు. మొదటి ఏడాదే లక్షా 35వేల డాలర్లు( కోటీ రూపాయలకు పైగా) వచ్చాయి. తమకు వచ్చిన లాయల్టీలో 13మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు. సైన్స్ లో పరిశోధనలు చేసే మహిళా శాస్త్రవేత్తలకు ఉపయోగపడేలా ట్రస్ట్ ఏర్పాటు చేశారు.
ఎలిజబెత్ అనేక అవార్డులను అందుకున్నారు. కెమోథెరపీలో స్క్విబ్ అవార్డు, మెడికల్ మైకోలాజికల్ సొసైటీ ఆఫ్ ది అమెరికాస్ నుంచి రోడా బెన్హామ్ అవార్డు, హోబర్ట్ , విలియం స్మిత్ కాలేజీల నుండి గౌరవ డిగ్రీ, కెమికల్ అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమిస్ట్స్ నుంచి పయనీర్ అవార్డు, ఇతర అనేక పురస్కారాలను ఆమె అందుకున్నారు. 24 జూన్, 1975న మరణించారు. ఆ తర్వాత 1994 లో నేషనల్ ఇన్వెంటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో నామినేట్ అయ్యారు.
పురాతన కళాఖండాలకు
ఎలిజబెత్, రేచల్ పరిశోధన ఫలితాలు మానవాళికే కాదు వృక్షజాతులకు ఎంతో ఉపయోగపడ్డాయి. పురాతన కళాఖండాలకు తిరిగి జీవం పొయడానికి కూడా ఉపకరిస్తున్నాయి.