ఎలక్ట్రిక్ కంచెతో గ్రేహౌండ్స్ కమెండో మృతి
posted on Feb 12, 2024 @ 1:03PM
రైతుల అతి జాగ్రత్త ఓ నిండు ప్రాణం బలైంది. పంట చుట్టూ వేసిన కరెంట్ ఫెన్సింగ్ వల్ల ఈ ఘాతుకం జరిగింది. రక్షణ వలయం భక్షణ వలయంగగా మారి ఆ కుుంబానికి శోక సంద్రం మిగిల్చారు.
గ్రేహౌండ్స్ కమాండో ఒకరు విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. నస్తూర్‌పల్లెలో కూంబింగ్ ఆపరేషన్‌లో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఓ ఐరన్ ఫెన్సింగ్‌ను పట్టుకున్న కమాండో ఎ.ప్రవీణ్ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
అటవీ జంతువుల నుంచి తమ పంటలను కాపాడుకునేందుకు సమీప ప్రాంతాల రైతులు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి కరెంటు వైరుతో రక్షణ ఏర్పాటు చేయడం సర్వ సాధారణం. ఇప్పుడిదే కమాండో ప్రాణాలు బలిగొంది. అడవిలో కొందరు అనుమానితులు సంచరిస్తున్నట్టు సమాచారం అందుకున్న గ్రౌహౌండ్స్ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో ప్రవీణ్ విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు.
ఎలక్ట్రిక్ కంచె ఏర్పాటు చేసిన గ్రామస్థులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రవీణ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. కాగా, ములుగు జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. గోవిందరావుపేటలో రమేశ్ (28) అనే వ్యక్తి ఎలక్ట్రిక్ ఫెన్సింగును ముట్టుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.