అసెంబ్లీలో 8 తీర్మానాలు ఆమోదం
posted on Sep 4, 2014 @ 3:26PM
ఆంద్రప్రదేశ్ శాసనసభ గురువారం నాడు ఎనిమిది తీర్మానాలను ఆమోదించింది. అవి...
1. హేతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన చేసిన తీరుపై శాసనసభ అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీర్మానం.
2. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి వుందని తీర్మానం.
3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా విజయవాడ సంపూర్ణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం కోరుతూ తీర్మానం.
4. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరచిన ప్రతిపాదనలు, హామీలను కేంద్రం వెంటనే నెరవేర్చాలని కోరుతూ తీర్మానం.
5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్నివిధాలా న్యాయం చేయడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరుతూ తీర్మానం.
6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక, విధానపరమైన మద్దతు అందించాలని కోరుతూ తీర్మానం.
7. పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్ళలో పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ తీర్మానం.
8. శాసనమండలి సీట్ల కేటాయింపులో అన్యాయాన్ని సవరించి 58 సీట్లకు పెంచాలని కోరుతూ తీర్మానం.