ఏపీలో విద్యా సంక్షోభం.. ఇంటర్ ఫలితాల్లోనూ జగన్ సర్కార్ ఫెయిల్!
posted on Jun 22, 2022 @ 4:17PM
రాష్ట్రంలో విద్యారంగానికి పెద్ద పీట వేసి వీలయినంత అభివృద్ధి సాధిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అర్ధం పర్థం లేకుండా పోయింది. ఎక్కడా విద్యా రంగానికి తగిన ప్రోత్సాహకాలు లభించకపోగా, అసలు తెలుగు మీడియం స్థానంలోకి ఇంగ్లీషు మీడియం తేవడానికి కంకణం కట్టుకున్నట్లు వ్యవహరించారు.
జగన్ మూడేళ్ల పాలనలో పరీక్షల నిర్వహణ ఈ ఏడాదే మొదటిది. మొదటి సారి నిర్వహించిన పరీక్షలు దారుణ ఫలితాలే ఇచ్చాయి. మూడేళ్ల పాలనలో విద్యారంగానికి పెద్దగా చేసిందేమీ లేదన్నది పరీక్షల నిర్వహణ, వాటి ఫలితాలతోనే తేలిపోయింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్న పరీక్షల నిర్వహణ బూమరాంగ్ అయి పాలకు లకే వూహించని షాక్ ఇచ్చింది. పిల్లల భవిష్యత్ ను దెబ్బతీయాలనుకునేవారిని పాల కులుగా ప్రజలు ఏ విధంగా అంగీకరిస్తారనేది ఆయనే చెప్పాలి.
పదో తరగతి పరీక్షల సమయంలో వైసీపీ ప్రభుత్వం చేసిన తతంగం అంతా ఇంతా కాదు. మొదటి రోజే ప్రశ్నాపత్రం లీక్ అయిందని అందుకు నారాయణ స్కూలు వారినే బాధ్యులుగా పేర్కొంటూ మాజీ మంత్రి టిడీపి నేత నారాయణ పాఠశాలల యజమాని నారాయణను అరెస్టు చేసేదాకా నిద్రపోలేదు. ఫలితాల ప్రకటనలో జాప్యం. అందులోనూ అవకతవకలూ ప్రజలు గమనించి నవ్వుకున్నారు. ఎంతో అద్భుతంగా పరీక్షలు నిర్వహించామని, అననుకూల పరిస్థితు ల్లోనూ విద్యార్ధులు అద్భుత విజయాలు సాధించారని ప్రచార ఆర్భాటాలు చేశారే గాని వాస్తవానికి ఫలి తాలు అందుకు విరుద్ధంగానే వెల్లడయ్యాయి. ఇంతకంటే జగన్ అధికారంలోకి రావడానికి ముందు జరిగిన పరీక్షల్లో పాస్‌పర్సంటేజ్ సుమారు 90 శాతం వుంది. దానితో పోల్చినపుడు ప్రస్తుత పర్సంటేజ్ ఏ స్థాయిలో సరితూగగలతో విద్యామంత్రి బొత్స వివరించాలి.
బుధవారం వెల్లడయిన ఇంటర్మీడియట్ ఫలితాల విషయంలోనూ ప్రభుత్వం ప్రచార ఆర్భాటమే కనప డింది. పరీక్షలు నిర్వహించిన 28 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించడం గొప్ప సంగతిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్ససత్యనారాయణ ఆనందపడవచ్చు. కానీ ఉత్తీర్ణతా శాతం చూస్తే సంబరపడటానికి ఏమీ లేదన్నది తేటతెల్లమైపోయింది ఫలితాలు వెల్లడించిన తర్వాత మంత్రి బొత్స విలేకరులతో మాట్లాడుతూ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో బాలికలే ఎక్కువ శాతం పాస్ అయ్యారని మంత్రి చెప్పారు.
ఇంటర్ ఫస్టియర్‌లో 4,45, 604 మంది, సెకండియర్‌లో 4,23455 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యా రని ఆయన తెలిపారు. ఒకేషనల్ కోర్సుకు సంబంధించి 72, 299 మంది పరీక్షలు రాశారన్న ఆయన మొత్తంగా 9, 41, 350 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యా రని చెప్పారు.
ఫస్టియర్ ఫలితాల్లో 2,41,591 మంది ఉత్తీర్ణత సాధించారన్న బొత్స పాస్ పర్సంటేజీ 54 శాతంగా నమోదైం దన్నారు.
ఇందులో బాలురు 49 శాతం, బాలికలు 65 శాతం పాస్ అయ్యారని తెలిపారు. సెకండియర్‌లో 2,58,449 మంది పాస్ కాగా 61 శాతం ఉత్తీర్ణత నమోదైందని ఆయన చెప్పారు. ఇందులో బాలురు 55 శాతం, బాలికలు 68 శాతం పాస్ అయ్యారన్నారు. పాలకుల దృష్టిలో అద్భుత పర్సంటేజ్‌గా ప్రచారం చేసుకోవడానికి తప్ప వాస్తవంగా ఇది ఏ స్థాయిలోనూ విద్యారంగంలో వూహించని దారుణ పరిణామంగా పేర్కొనాలి. ఇందుకు విద్యాశాఖ, సీఎం బాధ్యత వహించాల్సివుంటుంది. ఒకేషనల్‌లో మొదటి సంవత్సరం 45 శాతం, రెండో ఏడాది 55 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన వెల్లడించారు. అగస్టు 3వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీ క్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.