Read more!

కవితకు మళ్లీ ఈడీ నోటీసులు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ మళ్లీ   నోటీసులు ఇచ్చింది.   ఈ నెల 11,20,21 తేదీల్లో కవిత ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈడీ విచారణను సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. లిఖితపూర్వక వాదనలు వినిపించాలని కవిత, ఈడీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కవితకు ఏ క్షణమైనా నోటీసులు ఇచ్చే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయడం కీలకంగా మారింది.

 అయితే ఈ విచారణకు సంబంధించి ఆమె కానీ, ఆమె ప్రతినిథి కానీ హాజరు కావచ్చని ఈడీ పేర్కొంది. దీంతో ఈ రోజు విచారణకు కవితకు బదులుగా ఆమె న్యాయవాది సోమ భరత్ ను కవిత పంపించారు. కవిత ఈడీకి అందజేసిన  మొబైల్ ఫోన్లను తెరవనున్నామనీ, ఆ సమయంలో   స్వయంగా హాజరుకావడం లేదా తన ప్రతినిధిని పంపాలనీ ఈడీ పేర్కొన్నదనీ, అందుకే కవితకు బదులుగా ఆమె ప్రతినిథిగా న్యాయవాది సోమ భరత్ ఈడీ కార్యాలయానికి వెళ్లారని చెబుతున్నారు.