Read more!

వైసీపీలో అనూరాథ విజయం ప్రకంపనలు

ఎమ్మెల్యే కోటా   ఎమ్మెల్సీ ఎన్నికల్లో  తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం  అధికార వైసీపీలో చిచ్చుకు కారణమైందన్న చర్చ పొలిటిల్ సర్కల్స్ లో జోరుగా సాగుతోంది.  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడుకు మూడు స్థానాలలోనూ తెలుగుదేశం అభ్యర్థులే గెలిచినా వైసీపీలో పెద్దగా స్పందన లేదు. అసలు గ్రాడ్యుయేట్లు మా ఓటర్లే కాదు.. అది ఒక చిన్న సెక్షన్ మాత్రమే.. మా ఓటర్లు వేరే ఉన్నారంటూ సమర్ధించేసుకుంది.  అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో పంచుమర్తి అనూరాథ విజయాన్ని మాత్రం  వైసీపీ జీర్ణించుకోలేక పోతోంది.  అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల  విజయం అధికార పార్టీపై పట్టభద్రుల్లో ఉన్న వ్యతిరేకత ను తేటతెల్లం చేస్తే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీపై ఎమ్మెల్యేల్లో ఉన్న జగన్ పట్ల వ్యతిరేకత బహిర్గతమైంది.

క్రాస్ వోటింగ్ కు పాల్పడ్డారంటూ సస్పెన్షన్ వేటు పడిన నలుగురు వైసీపీ  ఎమ్మెల్యేలూ..  పంజరం నుంచి బయటపడినంత స్వేచ్ఛగా జగన్ పైనా, పార్టీపైనా విమర్శలు గుప్పించడం చూస్తుంటే  పార్టీలో ఇక ఒక్కరొక్కరుగానో, మూకుమ్ముడిగానో మరింత మంది ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని, అసమ్మతిని బయటపెట్టేందుకు రెడీ అవుతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నలుగిరిలో దళిత మహిళా ఎమ్మెల్యే అయిన  ఉండవల్లి శ్రీదేవి తన భర్త డాక్టర్ శ్రీధర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో వెల్లడించిన విషయాలు వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో   కోట్ల రూపాయలు  చేతులు మారాయంటూ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ఆరోపణలు వైసీపీకే నష్ట చేకూర్చాయి.  పార్టీ నుంచి సస్పెండైన  నలుగురు ఎమ్మెల్యేలూ కూడా సజ్జల ఆరోపణలకు చాలా చాలా ఘాటు రిప్లై ఇచ్చారు.  ఇంకోవైపు.. ఈ ఎన్నికల ఎపిసోడ్‌లో తనకు 10 కోట్ల ఆఫర్ ఇచ్చారంటూ జనసేన ఎమ్మెల్యేగా ఒకే ఒక్కడిగా ఉంటాను కానీ.. జగన్ పార్టీలో చేరి.. 152 వాడిగా ఉండనంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన.. కొద్ది రోజులకే... జగన్ పార్టీలోకి జంప్ కొట్టిన... ఒకే ఒక్కడు.. రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ తెరపైకి రావడం.. నీకు అంత సీన్ లేదు.. నీకు పదివేల రూపాయిల ఆఫరే ఇవ్వడమే ఎక్కువంటూ తెలుగుదేశం  నేతలు వరుసగా ప్రెస్ మీట్ పెట్టి వ్యంగ్య బాణాలు సంధించడంతో. ఆయన సైలెంటైపోయారు.  అయితే మార్చి 14వ తేదీన కేబినెట్‌ సమావేశంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్నీ మన ఫ్యాన్ పార్టీ అభ్యర్థులే గెలవాలని.. లేకుంటే మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు తథ్యం అంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించినా కూడా ఇలా జరగడం పార్టీలోనూ, ప్రజలలోనూ జగన్ ప్రభ మసకబారిందనడానికి తార్కానంగా విశ్లేషకులు చెబుతున్నారు. 

ఇక  ఎమ్మెల్యే   ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీసీ మహిళ పంచుమర్తి అనురాధ కు ముఖ్యమంత్రి  జగన్ ప్రజా వ్యతిరేక విధానాలను గట్టిగా ఎండగట్టిన  నేతగా   మంచి గుర్తింపు ఉంది.  మొత్తం మీద పంచుమర్తి అనూరాథ విజయం వైసీపీలో రగిల్చిన చిచ్చు ఇప్పట్లో ఆరేదిగా కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.