జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటి అక్రమాలపై ఈడీ నోటీసులు
posted on Oct 26, 2022 @ 2:04PM
జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో అవకతవకల ఆరోపణలపై ఈడీ విచారణ చేపట్టింది. ఈ భూ లావాదేవీల్లో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై దర్యాప్తు లో అక్రమాలు జరిగినట్టు నిర్ధారించిన ఈడీ జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటి లిమిటెడ్ ప్రస్తుత అధ్యక్షుడు, ఒక ప్రముఖ మీడియా సంస్థ చైర్మన్ సహా పలువురికి విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపింది.
వచ్చే నెల 7న ఉదయం 10.30 గంటలకు ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని మీడియా సంస్థ చైర్మన్ కు సమన్లు జారీ చేసిన ఈడీ 15 ప్రశ్నలతో కూడిన నోటీసు పంపినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ చైర్మన్ హోదాలో ఈ మీడియా సంస్థ అధినేత మనీలాండరింగ్ కు పాల్పడినట్టు గతంలోనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి విదితమే.
ఈయన అవకతవకలకు పాల్పడ్డారని పలు ఫిర్యాదులు వెల్లువెత్తిన క్రమంలోనే మనీలాండరింగ్ పై ఈడీ రంగంలోకి దిగి విచారణ జరి నోటీసులు జారీ చేసింది.