సృష్టి పై ఈడీ కేసు నమోదు
posted on Sep 25, 2025 @ 1:36PM
తీవ్ర సంచలనం సృష్టించిన సృష్టి టెస్టు ట్యూబ్ బేబీ సెంటర్ పై ఈడి కేసు నమోదు చేసింది. సరోగసి పేరుతో పిల్లల ట్రాఫికింగ్ కు పాల్పడిన సృష్టి.. ఆర్థిక పరిస్థితి బాగాలేని నిరుపేద కుటుంబాలను టార్గెట్ చేసుకొని వారికి డబ్బు ఆశ చూపించి వారి పిల్లల్ని కొనుగోలు చేసి సరోగసి పేరుతో పిల్లలు లేని వేరే దంపతులకు విక్రయిస్తూ కోట్లలో డబ్బులు సంపాదించారు. ఇలా దేశవ్యాప్తంగా ఫెర్టిలిటీ సెంటర్లను పెట్టి సరోగసి పేరు తో వ్యాపారం కొనసాగించారు. డాక్టర్ డాక్టర్ నమ్రత మరి కొంతమందితో కలిసి ఈ నయా దందాకు తెరలేపారు. గాంధీ హాస్పిటల్ లో అనస్థీషియా డాక్టర్ గా పనిచేస్తున్న వ్యక్తి కూడా వీరితో కలిసి పని చేశాడు. అయితే డాక్టర్ డాక్టర్ నమ్రత కేవలం నిరుపేద గ్రామీణ దంపతులను ట్రాక్ చేసి వారికి డబ్బు ఆశ చూపించి ఐదు లక్షల రూపాయలు వారికి ఇచ్చి వారి పిల్లల్ని కొనుగోలు చేసి.... సరోగసి పేరుతో పిల్లలు లేని దంపతులకు 50 లక్షల రూపాయలకు విక్రయించేవారు. ఎవరైనా దంప తులు ఎదురు తిరిగితే... లాయర్ అయిన తన కొడు కుతో డాక్టర్ డాక్టర్ నమ్రత వారిని బెదిరింపులకు గురి చేసేవారు.
అయితే ఇతర రాష్ట్రానికి చెందిన ఓ దంపతులు సరోగసి తో పిల్లలు కావాలంటూ డాక్టర్ డాక్టర్ నమ్రతను ఆశ్రయిం చారు. దీంతో డాక్టర్ నమ్రత ఆ దంప తుల వద్ద నుండి 50 లక్షల రూపా యలు వసూలు చేసి... వేరే దంపతులకు పుట్టిన శిశువును తీసుకు వచ్చి... సరోగసితో పుట్టిన శిశువు అంటూ సదరు దంపతులకు ఇచ్చారు. దంపతులకు అనుమానం వచ్చి డిఎన్ఏ టెస్ట్ చేయించారు. దీంతో సరోగసి పేరుతో డాక్టర్ డాక్టర్ నమ్రత మోసం చేసినట్లు నిర్ధారించుకున్న వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగిం చగా ఈ సరోగసి దందా అక్రమాలు మొత్తం బయట పడ్డాయి. పోలీ సులు వెంటనే డాక్టర్ డాక్టర్ నమ్రతతో పాటు ఈ దందాలో పాల్గొన్న డాక్టర్లను అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే గత నాలుగు ఏళ్లలో దేశవ్యాప్తంగా ఫెర్టిలిటీ సెంటర్లను పెట్టి సరోగసి పేరుతో దాదాపు 500 కోట్ల రూపా యల వరకు లావా దేవీలు జరిపినట్లు గా గుర్తించిన ఈడీ రంగంలోకి దిగింది.
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై ఈడి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులో భాగంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు మొత్తం తొమ్మిది ప్రదేశాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి క్లినిక్ లతోపాటు నిందితుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. డాక్టర్ అతలూరి నమ్రత ఆధ్వర్యంలో నడిచిన యూనివ ర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్, పిల్లలు లేని దంపతులను మోసం చేయడం, నకిలీ ఐవీఎఫ్ లు, సరోగసి ప్యాకేజీలు చూపించడం, శిశువుల అక్రమ రవాణా, ఫోర్జరీ రికార్డులు తయారు చేయడం వంటి అక్రమాలను గుర్తించింది. అలాగే 2021లో లైసెన్స్ రద్దయిన తరువాత కూడా అక్రమంగా ఈ దందా కొనసా గించినట్లు ఈడి దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం డాక్టర్ నమ్రత (64)తో పాటు వైద్యులు, ఏజెంట్లు, టెక్నీషియన్లు సహా కనీసం 24 మందిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. కేసులో క్రిమినల్ అంశాలను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారస్తుండగా, మనీ లాండరింగ్ కోణంలో ఆర్థిక లావాదేవీలను ఈడీ విచారిస్తోంది.