శ్రీకాకుళంలో భూ కంపం...భయాందోళనలో ప్రజలు
posted on Aug 28, 2024 @ 10:09AM
ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల భూకంపాలు వెన్నుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. గత ఏడాది టర్కీ,సిరియా భూకం ఘటన ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఈ ఘటనలో 50 వేల మందికిపైగా కన్నుమూశారు. భారత్, ఇండోనేషియా, పాకిస్థాన్, చైనా, నేపాల్, ఆఫ్ఘనిస్థాన్ లాంటి దేశాల్లో తరుచూ భూంకపాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ మధ్యనే జపాన్ లో భారీ భూకంపం సంభవించింది.. సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భారత్ లో ఎక్కువగా ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో తరుచూ భూకంపాలు వస్తున్నాయి. తాజాగా ఏపిలో భూకంపం సంభవించింది
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. దీంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రజలు అందరూ నిద్రిస్తున్న సమయంలో వేకువ జాము 3.45 గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించాయి. రెండు సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా నిద్రలో నుండి లేచి వీధుల్లోకి పరుగులు తీశారు. ఏం జరిగిందో కాసేపు అర్ధం కాక అయోమయానికి గురయ్యారు. భారీ స్థాయిలో వచ్చి ఉంటే తమ పరిస్థితి ఘోరంగా ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.