పేదల వైద్యుడు కె. ఎం. ఇస్మాయిల్ హుస్సేన్ కన్నుమూత
posted on Apr 15, 2020 @ 11:53AM
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయనను చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ ఉదయం 6 గంటలకు మృతి చెందారు. ఉస్మానియా కాలేజ్ ఎదుట ఆస్పత్రిని ఏర్పాటు చేసి గత 45 ఏళ్లుగా పేదోళ్ల కోసం డాక్టర్ ఇస్మాయిల్ విశేష సేవలు అందించారు. ఫీజు అడగకుండా రూ.20 ఇచ్చినా, రూ. 30 ఇచ్చినా.. ఇవ్వలేమని చెప్పినా... చిరునవ్వుతో వైద్యం చేయడం ఆయన విశిష్టత.
పేదల కోసం కార్పొరేట్ హంగులుతో పెద్ద నర్సింగ్ హోమ్ కట్టించి పేదలు ఇచ్చినంత తీసుకుని వైద్య సేవలు అందిచారాయన. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు.. కుమారుడు డాక్టర్ కె. ఎం ఇక్బాల్ హుస్సేన్ కూడా ప్రభుత్వ వైద్యుడు. ముగ్గురు అల్లుళ్ల లో ఒకరు ప్రస్తుతం కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మహమ్మద్ కాగా, మరో ఇద్దరు అల్లుళ్లు విదేశాల్లో ఇంజనీర్లుగా స్థిరపడ్డారు.