ఓటు హక్కు వ్యర్ధంచేసుకోవద్దుః ఓవైసీ
posted on Jun 28, 2022 @ 11:25AM
ఉన్నచోట అధికార పీఠం దరిదాపుల్లోకి వెళ్లలేని పార్టీ నాయకులు వేరే ప్రాంతాల్లో ఆవేశంగా తమ పార్టీని ప్రచారం చేసుకుని ప్రయోజనమేమిటి? హైదరాబాద్‌లో వేళ్లూనుకున్న ఎంఐఎం ఇక్కడ పాతబస్తీ మించి దాటలేని స్థితిలో వున్నది. కానీ ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మధ్యప్రదేశ్‌లో విస్తరించడానికి విశ్వ యత్నం చేస్తున్నారు. అక్కడ మొదటిసారిగా ఎన్నికల్లో పాల్గొంటున్న ఎంఐఎం పార్టీ అక్కడి మునిసిపల్ ఎన్నికల్లో గెలవడానికి కృషి చేయాలి, అక్కడి ఓటర్లను ఆకట్టుకోవాలి. అసలు అంతకుముందు అక్కడి ప్రజలకు అసదుద్దీన్ భావావేశం అర్ధం కావాలి. బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌కి నూక లు చెల్లిపోయాయి, ఆ పార్టీవారికి మద్దతు తెలపడంలో ఓటును దుర్వినియోగం చేసుకోవద్దని జబల్పూ ర్‌లో ఆవేశంగా మాట్లాడటంలో ఐవైసీ ఓటర్ల ను ఏమాత్రం ఆకట్టుకుంటారో చూడాలి. పైగా బిజెపి నాయ కత్వంలోని కేంద్రం పైనా సహజ రీతిలో విరు చుకుపడ్డారు. భారత సరిహద్దుల్లోకి చైనా సైన్యం చొచ్చుకు రావడాన్ని నిలువరించడంలో దారుణంగా విఫలమయిందని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.
ఇతర రాష్ట్రాల్లో తన పార్టీని విస్తరించుకోవడంలో భాగంగా ఆవేశపూరిత ప్రసంగాలు చేసి కాంగ్రెస్, బిజెపీ పట్ల తమ విముఖతను చాటుకోవడంలో అక్కడి ఓటర్లు, ప్రజలు నమ్మేస్తారనుకోవడం వొట్టి భ్రమే అవు తుంది. కాంగ్రెస్ పార్టీ చాలాకాలం నుంచి వున్నది, బిజెపి పార్టీ నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం వున్నది. ఈ రెంటిని అమాంతం నోటికి వచ్చినట్టు తిట్టేసి తన పార్టీని గెలిపించితే స్థానిక స్థాయి నుంచి తమ పార్టీవారు ప్రజలకు చేదోడు వాదోడుగా నిలుస్తారు అన్నది ఓటర్లకు తెలియజేసే పంథా తిట్టుడు ప్రచారంతో అవుతుందా అన్నది ఓవైసీ తెలుసుకోవాలి. హైదరాబాద్‌లోవలె మధ్యప్రదేశ్ జబల్‌పూర్ లోనూ పిచ్చిగా వెన్నంటే తిరుగుతారని అనుకోవడం తొందరపాటే అవుతుందని విశ్లేషకులు అంటు న్నారు.
కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం మీద విరుచుకుపడుతూ, మోదీ ప్రభుత్వం సరిహద్దు అంశాలను నిర్ల క్ష్యం చేస్తున్నారన్నారు. దేశంలో ముస్లింలు అన్ని రంగాల్లో ముఖ్యంగా విద్యారంగంలో వెనుకబడి వున్నా రని దేశంలో విద్యావకాశాల పై అఖిల భారత సర్వే తెలియజేసిందన్నారు. దేశంలో ముస్లింల అభివృ ద్ధికి ప్రభుత్వాలు చొరవచూపాలన్నారు.