ఉద్యోగుల్ని తొలగించొద్దు! వేతనాలు తగ్గించవద్దు! కార్మిక మంత్రిత్వ శాఖ
posted on Apr 15, 2020 @ 10:11AM
లాక్ డౌన్ తో ఇప్పటికే భారత ఆర్థిక వ్యవస్థపై, ఉద్యోగాలపై భారీగా ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో కంపెనీలు, సంస్థల యాజమాన్యాలకు ప్రధాని మోడీ ఓ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించవద్దని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. మీ ఉద్యోగుల పట్ల సానుభూతి చూపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగించవద్దని సంస్థలకు సూచిస్తున్నాయి. మంగళవారం కర్ణాటక ప్రభుత్వం ఉద్యోగులను తొలగించవద్దని, వేతనాలు తగ్గించవద్దని సూచించింది. అన్ని ఆర్థిక వ్యవస్థలు నిలిచిన ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులను ఇబ్బంది పెట్టవద్దని సూచించింది.
ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ కూడా కంపెనీలకు సూచన చేసింది. ఉద్యోగులను తొలగించవద్దని, వేతనాలు తగ్గించవద్దని మహారాష్ట్ర ప్రభుత్వం కూడా కంపెనీలకు సూచించింది.