రంభ కేసు: నటి సోదరుడి పూర్తి క్లారిఫికేషన్
posted on Jul 23, 2014 @ 5:23PM
రంభ కుటుంబం మీద, తల్లిదండ్రుల మీద రంభ మరదలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పెట్టిన గృహహింస కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసు నేపథ్యంలో రంభ సోదరుడు శ్రీనివాస్ మీడియా ముందుకు వచ్చి ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరణ ఇచ్చారు...
1. నా భార్య పల్లవి మా కుటుంబ మీద తప్పుడు కేసు పెట్టింది. ఆమె చెన్నైలోని మా ఇంట్లో వున్న వజ్రాల నగలు, మా ఇద్దరు పిల్లలను తీసుకుని హైదరాబాద్‌లోని పుట్టింటికి ఈ ఏడాది ఫిబ్రవరి 2న వచ్చేసింది. ఈ విషయాన్ని అప్పుడే మా తండ్రి చెన్నైలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
2. నేను ఆ సమయంలో టొరంటోలో వున్నాను. నా భార్య ఆస్తితో, పిల్లతో పుట్టింటికి వెళ్ళిపోయిందని తెలిసి నేను ఇండియాకి తిరిగి వచ్చాను. నా భార్య తాను చేసిన దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికే మా మీద ఈ గృహహింస కేసు పెట్టింది.
3. నాకు పల్లవితో పెళ్ళయి పదిహేనేళ్ళు అయింది. ఇద్దరు పిల్లలున్నారు. ఇన్నాళ్ళుగా లేని వేధింపులు ఆమెకు నేను దేశంలో లేనప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చాయో, ఇంట్లోంచి నగలు తీసుకుని ఎందుకు వెళ్ళిపోయిందో మాకు తెలియదు.
4. ఈ విషయం మీద నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశాను. నన్ను అరెస్టు చేయకూడదని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
5. 1999లో నాతో పెళ్ళయిన సమయానికి పల్లవి కుటుంబం అద్దె ఇంటిలో వుండేది. ఇప్పుడు వారికి ఒక బంగ్లా, మూడు ఫ్లాట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి?
6. పల్లవి కుటుంబం మాకు ఏ రూపంలో కట్నం ఇచ్చారో.. మేం కట్నం కోసం ఎప్పుడు వేధించామో ఆధారాలతో సహా నిరూపించాలని డిమాండ్ చేస్తున్నాను.
7. మహిళల భద్రత కోసం ఉద్దేశించిన 498ఎ సెక్షన్‌ని దుర్వినియోగం చేయడం సరైన పద్ధతి కాదు.
8. ప్రచారం కోసమే పల్లవి ఈ కేసులో నా సోదరి రంభని ఇరికించింది. ఈ కేసుతో రంభకి ఎలాంటి సంబంధం లేదు.ఆమెని ఇబ్బంది పెట్టడం న్యాయం కాదు.