తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం (మే 9)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 22 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది.  

ఇక గురువారం (మే 8) శ్రీవారిని మొత్తం 64 వేల850 మంది దర్శించుకున్నారు, వారిలో 28 వేల816 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల 70 లక్షల రూపాయలు వచ్చింది. 

Teluguone gnews banner