పెద్దపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్
posted on Nov 13, 2024 @ 11:12AM
తెలంగాణలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ సమీపంలోని కన్నాల రైల్వే గేటుకు కూత వేటు దూరంలో జరిగింది. ఈ ప్రమాదంలో 11 బోగీలు అదుపు తప్పి బోల్తా పడ్డాయి. ఈ గూడ్స్ రైలు కర్ణాటకలోని బళ్లారి నుంచి యూపీలోని గజియాబాద్‌కు వెళుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.కరీంనగర్, పెద్దపల్లి రైల్వే స్టేషన్లు దాటి తర్వాత రాఘవాపూర్ వద్ద జరిగింది. భారీ శబ్దంతో పట్టాలు తప్పడంతో సమీప గ్రామాలకు చెందిన వారు ప్రమాద స్థలికి చేరుకున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ మార్గంలో వెళ్లే పలు రైళ్లను ఆయా స్టేషన్ల వద్ద నిలిపివేశారు.