కడియం శ్రీహరి పార్టీ మారనున్నారా?
posted on Oct 1, 2018 @ 12:24PM
తెరాస లో ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఉప ముఖ్యమంత్రిగా పలు కీలక పదవులు చేపట్టిన నేత కడియం శ్రీహరి. కడియం వంటి కీలక నేత పార్టీ వీడుతున్నాడంటూ కొన్ని రోజులుగా ఊహాగానాలు నెలకొన్నాయి.ఈ ఊహాగానాలకు తెరదింపుతూ తనకు పార్టీలు మారాల్సిన అవసరం లేదని, నైతిక విలువలు, నీతి నిజాయితీలే పెట్టుబడిగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని కడియం స్పష్టం చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ మాటే తనకు శిరోధార్యం అని అన్నారు.వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని హరిత హోటల్‌లో విలేకరులతో ఆయ న మాట్లాడారు. ఈ మధ్య సోషల్ మీడియాలో తాను తెరాసను వీడుతున్నానని తప్పుడు ప్రచా రం జరుగుతోందని, అలాంటి వాటిని ప్రజలు, మీడియా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తనకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ఏనాడూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని చెప్పారు.కొంతకాలంగా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో రాజయ్యకు వ్యతిరేకంగా జరిగే ఆందోళనలు త్వరలో సమసిపోతాయన్నారు. గతంలో నేను స్టేషన్ ఘన్‌పూర్‌లో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు నేను రావాలని కోరుకుంటున్నారు. కానీ నాకు పోటీ చేసే ఆలోచన లేదన్నారు.మంత్రి కేటీఆర్ వద్ద స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన అసమ్మతి నేతలు సమావేశమవుతున్నారు. కేటీఆర్ వారి సమస్యలను, ఆవేదనను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు.కొండా దంపతులు ఆరు నియోజకవర్గాల్లో ప్రభావితం చూపించగలిగే వాళ్ళే వరంగల్ తూర్పు నుంచే పోటీ చేయాలి కానీ తూర్పును వదిలి పరకాలకు వెళుతున్నారంటే ఓటమిని అంగీకరించడమే అని విమర్శించారు.పార్టీల పుట్టుకకు సంబంధించిన సిద్ధాంతాలను మరచి అపవిత్ర కూటమిగా మహాకూటమి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఏర్పడిందే తెలుగుదేశం పార్టీ. కేవ లం సీట్ల కోసం వారు పొత్తు పెట్టుకున్నారు. విభిన్న సిద్ధాంతాలతో ఏర్పడుతున్న మహా కూటమి త్వరలోనే కుక్కలు చింపిన విస్తరిలాగా తయారవుతుంది.