లిక్కర్ దందా...బయటపడుతున్న తాడేపల్లి ప్యాలస్ లింకులు!?
posted on Sep 10, 2022 @ 10:32AM
ఢిల్లీ లిక్కర్ స్కారం విషయంలో విపక్షం తన సతీమణి భారతిపై ఆరోపణలు చేస్తుంటే కౌంటర్ ఇవ్వకుండా సైలంట్ గా ఉంటారా? అంటూ జగన్ తన మంత్రివర్గ సభ్యులపై ఫైర్ అయినే మంత్రి పదవులు ఊడబీకి పారేస్తాను జాగ్రత్త అంటూ హెచ్చరించినా ఎవరూ కూడా పెదవి విప్పకపోవడానికి కారణమేమిటన్నది మెల్లమెల్లగా బయటకు వస్తోంది.
ఏ ఢిల్లీ లిక్కర్ స్కాంపై జగన్ సతీమణి భారతిపై ఆరోపణలు వచ్చాయో అదే లిక్కర్ స్కార్ డొంక మెల్లిమెల్లిగా కదులుతోంది. తాజాగా జరిగిన ఈడీ రైడ్స్ లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి పాత్ర ఉందని బయటపడింది. ఈ విషయాన్ని తెలంగాణ బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే రఘునందనరావు మీడియాకు వెల్లడించారు. తాజాగా ఈడీ జరిపిన సోదాల్లో విజయసాయి అల్లుడి పేరు బయటపడింది. సృజన్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్న కంపెనీలపై దాడులు నిర్వహించిన ఈడీ దాడుల్లో ఇందుకు సంబంధించి ఆధారాలు లభ్యమయ్యయని ఆయన మీడియా ముందు చెప్పారు. విజయసాయి లింకులు ఢిల్లీ లిక్కర్ దందాలో ఉన్నాయంటే.. వాటి వెంబడే తాడేపల్లి లింకులు కూడా బయటపడతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఢిల్లీ లిక్కర్ స్కాం లో తన సతీమణిపై వచ్చిన ఆరోపణలతో జగన్ తీవ్ర అసహనానికి లోనయ్యారని చెబుతున్నారు. అయితే జగన్ ఎంతగా బెదరించినా, హెచ్చరికలు జారీ చేసినా ఆయన కేబినెట్ సహచరులు జగన్ కోరుకున్న విధంగా విపక్షం విమర్శలను అగ్రసివ్ గా ఖండించకపోవడమే.. విపక్షాల ఆరోపనల్లో ఏదో మేరకు వాస్తవం ఉందనడానికి నిదర్శనంగా వారు చెబుతున్నారు. ఇలా ఉండగా జగన్ కేబినెట్ నుంచి ఉద్వాసన చెబుతానని హెచ్చరించిన తరువాత అమాత్యుల నుంచి మర్యాద గీత దాటిన ఖండనలు మాత్రమే రావడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.
మంత్రి పదవులు ఇచ్చింది బుగ్గకార్లు ఎక్కి తిరగడానికా ? అంటూ కొందరు మంత్రులకు జగన్ ముఖం మీదనే క్లాసు పీకారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. కొందరు మంత్రులు ప్రభుత్వ, పార్టీ వ్యవహారాల విషయంలో అంటీ ముటగ్టనట్టు వ్యవహరిస్తున్నారనీ, అటువంటి వారికి ఉద్వాసన తప్పదనీ సీఎం ఘాటుగానే హెచ్చరించారని కూడా అంటున్నారు. ఇంత ఘాటు హెచ్చరికలు చేసిన మంత్రులలో ఏ మాత్రం స్పందన లేకపోవడం.. కేబినెట్ లో సీఎంకు పట్టు సడలిందనడానికి తార్కాణమని అంటున్నారు. అందుకు కారణం మంత్రులు, ఎమ్మెల్యేలలో పలువురికి సీఎం తీరు పట్ల తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం కావడమేనని పరిశీలకులు అంటున్నారు. సీఎం మీటలు నొక్కి తన గ్రాఫ్ బ్రహ్మాండంగా ఉందని అనుకుంటున్నారనీ, ప్రభుత్వం, పార్టీపై వ్యక్తమౌతున్న ప్రజా వ్యతిరేకత అంతా మంత్రులు, ఎమ్మెల్యేల వల్లనేనని సమయం, సందర్భం వచ్చినా రాకున్నా పదేపదే చెబుతూ తమ ప్రతిష్టను జనాలలో చిన్నబుచ్చడానికే ప్రయత్నిస్తున్నారన్నది వారి అసహనానికి, ఆగ్రహానికీ కారణంగా చెబుతున్నారు.