ఢిల్లీ లిక్కర్ స్కాం.. బోయినపల్లి అభిషేక్ అరెస్టు
posted on Oct 10, 2022 @ 10:35AM
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టుల పర్వం ప్రారంభమైంది. ఈ స్కాం కు సంబంధించి తెలంగాణలొ తొలి అరెస్టు జరిగింది. తెరాస అగ్రనేతలకు సన్నిహితుడైన బోయనపల్లి అభిషేక్ ను సీబీఐ అరెస్టు చేసింది. హైదరాబాద్ కు చెందిన బొయినపల్లి అభిషేక్ అరెస్టు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తోంది.
హైదరాబాద్ లో బోయినపల్లి అభిషేక్ ను అదుపులోనికి తీసుకున్న సీబీఐ ఆయనను ఢిల్లీకి తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించినంత వరకూ తెలుగు రాష్ట్రాలలో జరిగిన తొలి అరెస్టు ఇది.
రాబిన్ డిస్టలరీస్ లో డైరెక్టర్ గా ఉన్న అభిషేక్ రావు, హైదరాబాద్ కు చెందిన లిక్కర్ వ్యాపారి రామచంద్రన్ పిళ్లైతో కలిసి వ్యాపారం చేస్తున్నట్లు సీబీఐ గుర్తించింది. అంతే కాకుండా దాదాపు 9 కంపెనీల్లో అబిషేక్ రావు డైరెక్టర్ గా ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సన్నిహితుడు విజయ్ నాయర్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కింఇటీవల హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరు, చెన్నై, పంజాబ్, ఢిల్లీలలో పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది.
ఈ సోదాల్లో కీలక ఆధారాలు సేకరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ సోదాలు ముగిసిన క్రమంలో అభిషేక్ రావును అరెస్ట్ చేయడం చర్చకు దారి తీసింది. టీఆర్ఎస్ నేతలతో అభిషేక్ రావుకు సంబంధాలు ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది. దీంతో ఇప్పుడు అభిషేక్ రావు అరెస్ట్ తెలంగాణలో సంచలనంగా మారింది.
దసరా తురువాత ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తులో సీబీ, ఈడీ దూకుడు పెంచాయి. హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరు, చెన్నై, పంజాబ్, ఢిల్లీలలో పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిం పలు కీలక ఆధారాలు సేకరించింది. ఈ సోదాల నేపథ్యంలోనే అభిషేక్ రావును అరెస్ట్ చేసింది.