దీపిక ‘మై ఛాయిస్’ సంచలనం
posted on Mar 30, 2015 @ 6:39PM
బాలీవుడ్ హీరోయిన్ దీపిక పడుకొనే హోమీ అదాజానియా దర్శకత్వంలో ‘మై ఛాయిస్’ పేరుతో రూపొందించిన వీడియో ఇప్పుడు యూ ట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. పోస్టు చేసిన ఒక్కరోజులోనే 22 లక్షల మందికి పైగా విజిటర్లు ఈ వీడియో చూశారు. మహిళా శక్తిని పురుష ప్రపంచానికి స్పష్టంగా చెప్పేలా వున్న ఈ వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.