దానంపై అధిష్టానం ప్రశంసలు..ఈరకంగా ఐసా..?
posted on Dec 15, 2015 @ 3:34PM
తెలంగాణ సీనియర్ నేత దానం నాగేందర్ పార్టీ మార్పుపై జరిగిన హడావుడి అంతా ఇంతాకాదు.దానం పార్టీ మారుతున్నారని ఈమధ్య కాలంలో వార్తలు జోరుగా సాగాయి.దీనికి తోడు దానం కూడా టీఆర్ఎస్ నేతలతో మంతనాలు జరిపే సరికి ఇక టీఆర్ఎస్ గూటికి వెళ్లడం ఖాయం అయినట్టే అనుకున్నారు.ఇంతలో తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని దానం ట్విస్ట్ ఇచ్చారు.దీంతో కొంత మంది దానంపై విమర్శలు చేస్తే..కొంతమంది మాత్రం ప్రశంసలు కురిపించారు.అందునా దానం చర్యలు చూసి కాంగ్రెస్ అధిష్టానం అతని వైఖరిపై మండిపడుతుంది అనుకుంటే..ఊహించని విధంగా వారే దానంను ప్రశంసించడం అశ్చర్యకరం.టీఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా దానం మాత్రం పార్టీని వీడకుండా అంటిపెట్టుకున్నారని ప్రశంసించారు.అంతేకాదు నగర కాంగ్రెసు పార్టీలో శిఖరప్రాయమైన నేతగా దానం నాగేందర్‌ను ఢిల్లీ పెద్దలు ప్రశంసిస్తూ జిహెచ్ఎంసి ఎన్నికల్లో పార్టీని విజయం దిశగా నడిపించగలరనే ఆశాభావం వ్యక్తం చేశారు.మొత్తానికి దానం పార్టీ మార్పుపై మళ్లీ ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్ ఇస్తారా అని ఈరకంగా కాంగ్రెస్ పార్టీ ఐస్ చేస్తున్నట్టు ఉంది.