షర్మిలా నా చెల్లెలు..కలుస్తా : దానం

 

 

 

షర్మిలా తనకు చెల్లెలని, ఆమెకు గాయమైతే పరమర్సిస్తానని మంత్రి దానం నాగేందర్ అన్నారు. అందులో తప్పేంటని కూడా ఆయన వ్యాఖ్యానించారు. చాలా రోజుల నుండి మీడియా కు దూరంగా ఉన్న దానం ప్రస్తుతం ఈ సంచలన వ్యాఖ్యలతో మరలా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.

 

వై ఎస్ ఎప్పటికీ తన గుండెల్లో ఉంటారని మంత్రి అన్నారు. అయితే, దానం ఈ ప్రకటన తర్వాత కొంత మంది సన్నిహితులు అలా మాట్లాడటం సరి కాదని ఆయనకు సర్ది చెప్పినట్లు తెలిసింది. ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితునిగా మెలుగుతున్న సమయంలో, వేరే పార్టీకి సంభందించిన వ్యక్తి గురించి ఇలా మాట్లాడటం సరి కాదని ఆయనకు సలహాలు వచ్చినట్లు సమాచారం.

 

దానం చేసిన ఈ ప్రకటనను కొంత మంది తమ రాజకీయ అవసరాలకు వాడుకొనే అవకాశం కూడా ఉంది.

Teluguone gnews banner